ఉగ్ర దాడి ఎఫెక్ట్: పాక్‌తో వ్యాపారం తెంచుకుంటాం
ఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని యూరిలో ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో పాకిస్తాన్ ఏకాకి అవుతోంది. భారత దేశంలో పాకిస్తాన్ పైన ఆగ్రహం వెల్లువెత్తుతోంది. యూరి ఘటన పైన భారతీయ టీ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వం అనుమతిస్తే పాకిస్థాన్‌తో వ్యాపారాన్ని నిలిపేస్తామని చెప్పింది.
ఈ విషయాన్ని అసోసియేషన్ అధ్యక్షులు అజమ్ మీనమ్ పీటీఐకి తెలిపారు. పాకిస్థాన్‌తో టీ వాణిజ్యం నిలిపివేసినంత మాత్రాన దేశీయంగా ఎటువంటి ప్రభావం పడదన్నారు. ఈ విషయంలో టీ బోర్డు తమకు మార్గదర్శకంగా ఉంటుందన్నారు.
భారత్ మొత్తం 230 మిలియన్ కేజీల టీని ఎగుమతి చేస్తుంది. వీటిల్లో పాకిస్థాన్‌కు కేవలం 15 నుంచి 18 మిలియన్ కేజీల టీ పొడిని మాత్రమే పంపిస్తుంది. పాకిస్థాన్ కూడా శ్రీలంక, కెన్యాల నుంచి టీని దిగుమతి చేసుకుంటుంది. ఇక్కడ ధరలు పడిపోయినప్పుడు మాత్రమే భారత్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. పాక్ దిగుమతి చేసుకునే దాంట్లో 80శాతం దక్షిణ భారత్ నుంచి, మిగిలింది ఉత్తర భారత్ నుంచి అని అజమ్ చెప్పారు.

ఇదిలా ఉండగా, సైనికులు చేయించుకునేట్టుగానే పొట్టి క్రాఫ్, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే చాక్లెట్లు, శరీరానికి శక్తినిచ్చే ఎనర్జీ పానీయాలు, మందులు తదితర వస్తువులతో భారత్‌లోకి చొరబడి యూరీలోని బేస్ క్యాంప్ పైన దాడికి దిగిన ఉవాదుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయింది.
ఉగ్రవాదుల పైన సైన్యం కాల్పులు జరిపింది. నలుగురు ఉగ్రవాదుల శరీరంలో మొత్తం 169 బులెట్లు దిగాయని పోస్ట్‌మార్టం చేసిన వైద్య వర్గాలు వెల్లడించాయి. వీళ్లందరి మృతదేహాలనూ యూరీకి 50 కి.మీ. దూరంలో గుర్తు తెలియని చోట ఖననం చేసినట్టు తెలిపారు. వాళ్ల ఆయుధాలపై కూడా బులెట్ రంద్రాలు ఉన్నాయన్నారు.












Click it and Unblock the Notifications