పాక్‌ను జవాన్లు మూసేశారు: మోడీ, షరీఫ్ హెచ్చరిక
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ/ముంబై: పాకిస్తాన్ నోటిని మన భారత దళాలు మూసేశాయని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అన్నారు. ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మన జవాన్లు బార్డర్‌లో ధీటుగా పోరాడుతున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ దానిని రాజకీయం చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు.
ఇప్పటి ఓటమితో పాకిస్తాన్ మరోసారి కాల్పులు జరిపే దుస్సాహసానికి పాల్పడవని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ఓటమితో పాకిస్తాన్ పాఠం నేర్చుకుంటుందన్నారు. పాక్ కాల్పుల వల్ల ఇళ్లు కోల్పోయిన వారికి, ఇళ్లు విడిచిన వారిని తాము ఆదుకుంటామని చెప్పారు.
బార్డర్‌లో జరుగుతున్న విషయాన్ని అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలనుకుంటుందని, కానీ ఇది సమయం కాదని హితవు పలికారు. మరోవైపు ఢిల్లీలో పార్లమెంట్ నార్త్ బ్లాక్‌లో కీలక సమావేశం జరిగింది. హోంశాక సహాయక మంత్రి కిరణ్ రిజిజు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, బీఎస్‌ఎఫ్ డీజీ సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షించారు.

నవాజ్ షరీఫ్ హెచ్చరిక
భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమని, దాన్ని బలహీనతగా భావించరాదని పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ శుక్రవారం ప్రకటించారు. భారతదేశం అకారణంగా దాడులు చేస్తోందని ఆరోపించారు. భారత్ దాడుల బాధిత దేశం పాకిస్తానేనని అన్నారు. భారత్ కాల్పులను వెంటనే ఆపేయాలని వ్యాఖ్యానించారు.
ఇస్లామాబాద్‌లో శుక్రవారం నవాజ్ షరీఫ్ త్రివిధ దళాధిపతులతో జాతీయ భద్రతా సమితి సమావేశం నిర్వహించారు. దాదాపు పది రోజులుగా జరుగుతున్న కాల్పులు నేపథ్యంలో పాకిస్తాన్ ఉన్నతాస్థాయి సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి.
పాకిస్తాన్ సైనిక దాడులను భారత్ సేనలు దీటుగా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీంతో పాకిస్తాన్ దళాలు వెనుకడుగు వేశాయి. గత రాత్రి నుంచి పాక్ సైనికుల దాడుల తీవ్రత తగ్గింది. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న అంశంపైనే త్రివిధ దళాధిపతులతో చర్చలు జరిగాయి.












Click it and Unblock the Notifications