''భారతీయులకు ఏ సహయం చేసేందుకైనా సిద్దమే, శ్రీనివాస్ పై కాల్పులకు సిగ్గుపడుతున్నా''
భారతీయులు తమ పట్టణానికి చాలా ముఖ్యమైన వారని అమెరికాలోని క్యానాస్ గవర్నర్ శ్యామ్ బ్రౌన్ బ్యాక్ అన్నారు. తమ నగరంలోకి అన్నివేళలా స్వాగతం పలుకుతామన్నారాయన.
న్యూయార్క్:భారతీయులు తమ పట్టణానికి చాలా ముఖ్యమైన వారని అమెరికాలోని క్యానాస్ గవర్నర్ శ్యామ్ బ్రౌన్ బ్యాక్ అన్నారు. తమ నగరంలోకి అన్నివేళలా స్వాగతం పలుకుతామన్నారాయన.
క్యానాస్ నగరంలోని బార్ లో జరిగిన కాల్పుల్లో శ్రీనివాస్ కూచిబొట్ల మరణించాడు. ఆలోక్ రెడ్డి అనే భారతీయుడు ఈ ఘటనలో తృటిలో ప్రాణపాయం నుండి తప్పించుకొన్నాడు.
క్యానాస్ గవర్నర్ ప్రత్యేకంగా భారతీయ దౌత్యాధికారులు, భారత కమ్యూనిటీకి చెందిన ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశమై భరోసా ఇచ్చారు. ఎన్నో దేశాల నుండి తమ పట్టణానికి వస్తుంటారని కానీ, భారతీయులు తమకు చాలా ముఖ్యమని ఆయన చెప్పారు.

భారతీయులపై జాతి వివక్ష పేరుతో హింస జరగడాన్ని తాము అంగీకరించబోమని ఆయన చెప్పారు. శ్రీనివాస్ కూచిబొట్లపై కాల్పుల ఘటనను ఆయన ఖండించారు. ఈ ఘటనకు తాను సిగ్గుపడుతున్నట్టుగా ఆయన ప్రకటించారు.
ఇండియన్స్ కు ఎప్పుడు ఎలాంటి సహయం కావాలన్నా అందించేందుకు తాను సిద్దంగా ఉన్నానని ఆయన ప్రకటించారు.ఇక శ్రీనివాస్ కాల్పుల ఘటన సమయంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన గ్రిలాట్ ను కలుసుకోనున్నట్టు భారతీయ కాన్సులేట్ తరపున పనిచేసే కాన్సుల్ జనరల్ అనుపమ్ రాయ్ చెప్పారు.












Click it and Unblock the Notifications