కువైట్ ఎయిర్‌పోర్ట్‌లో 13 గంటలుగా భారతీయుల పడిగాపులు.. ఎంబసీ ఎంట్రీతో

ముంబై నుంచి మాంచెస్టర్‌కు బయల్దేరిన విమానం కువైట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడంతో భారతీయ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 13 గంటలకుపైగా కువైట్ విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. దాదాపు 60 మందికిపైగా భారత ప్రయాణికులు విమానాశ్రయంలోనే గంటలుగా పడిగాపులు కాస్తున్నారు.

అయితే, వారికి సరైన ఆహారం కూడా అందించకపోవడంతో అవస్థలు పడుతున్నారు. తమకు సహాయం అందించేవారే లేరంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం అమెరికా, యూకే పాస్‌పోర్టులు కలిగినవారికి మాత్రమే సదుపాయాలు అందించడంతో తాము తీవ్ర అవస్థలు పడుతున్నట్లు భారత ప్రయాణికులు వాపోతున్నారు.

Indians stranded at Kuwait airport for 13 hours

తమను పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన కొందరు ప్రయాణికులు కువైట్ ఎయిర్‌పోర్టులో అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎయిర్ లైన్స్ సిబ్బంది తమను వేధించారని.. అమెరికా, యూకే నుంచి వచ్చిన వారికి మాత్రమే ఎయిర్‌లైన్స్ వసతి కల్పించినట్లు పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

ముంబై నుంచి బయల్దేరిన విమానం బహ్రెయిన్ మీదుగా మాంచెస్టర్ వెళ్లాల్సి ఉండగా.. అకస్మాత్తుగా ప్రతి ఒక్కరూ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు సిద్ధం కావాలని ఎయిర్ లైన్ సిబ్బంది చెప్పారని ఓ ప్రయాణికుడు తెలిపారు. ఇంజిన్‌లో మంటలు, పొగలు వచ్చినట్లు తాను చూశానని మరో ప్రయాణికుడు వెల్లడించారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండైన తర్వాత తమకు కూర్చోవడానికి కూడా స్థలం ఇవ్వలేదని మండిపడ్డారు. దీంతో తాము నేలపైనే కూర్చుకున్నామన్నారు. అయితే, ఈ వ్యవహారంపై గల్ఫ్ ఎయిర్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం.

మరోవైపు, ఎయిర్ పోర్టులో భారతీయులు చిక్కుకున్న విషయంపై కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని గల్ఫ్ ఎయిర్ దృష్టికి తీసుకెళ్లింది. ఎంబసీకి చెందిన బృందం ఎయిర్‌లైన్స్‌తో సమన్వయం చేస్తూ ప్రయాణికులకు సహాయం అందించేందుకు విమానాశ్రయం వద్దకు చేరుకుంది. ప్రయాణికులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకుంది.

ఆ తర్వాత ఎయిర్ పోర్టులోని రెండు లాంజ్‌లను వసతి కోసం ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది. జీసీసీ సమ్మిట్ జరుగుతున్న దృష్ట్యా ఎయిర్ పోర్ట్ హోట్‌లో వసతి లేదని..వీలుంటే అక్కడే వసతి కల్పిస్తామని పేర్కొంది. కువైట్‌లో దిగిన తర్వాత వీసా పొందే అవకాశం భారత పౌరులకు లేదని.. జసీసీ సదస్సు కారణంగా అన్ని ప్రభుత్వ కార్యాయాలు కూడా మూసివున్నట్లు అధికారులు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+