'భారత్-అమెరికా సైనిక బంధం మరింత బలపడింది'
వాషింగ్టన్: భారత్ అమెరికా మధ్య సైనిక సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా మరింత బలపడ్డాయని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి ఆష్టన్ కార్టర్ గురువారం నాడు అన్నారు. రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాలు పలు విషయాల్లో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు.
భారత్, అమెరికా వ్యూహాత్మక విషయాల్లో, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన విషయాల్లో పలు ఒప్పందాలు చేసుకున్నాయని, ఉపరితల, గగనతల, సముద్ర తీరంలో రెండు దేశాలు కలిసి యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ మేకిన్ ఇండియా ప్రచారంలో భాగంగా భారతదేశంతో టెక్నాలజీకి సంబంధించి కూడా ఒప్పందాలు చేసుకున్నామని, ఈ ఒప్పందాల ద్వారా రెండు దేశాల రక్షణ మెరుగుపడటమే కాకుండా విభిన్న ఆయుధ వ్యవస్థల ఏర్పాటులో సహకారం పెరుగుతుందన్నారు. అమెరికాకు ప్రాంతీయ భాగస్వామ్యాలు సంఖ్యలోను, స్నేహంలోను క్రమంగా పెరుగుతోందన్నారు.












Click it and Unblock the Notifications