ముందు జాగ్రత్తగా... ఇండో - నేపాల్ సరిహద్దు మూసివేత
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండో-నేపాల్ సరిహద్దును మూసివేశారు. యూపీ రెండో దశ ఎన్నికల పోలింగ్ ముగిశాక మళ్లీ ఈ సరిహద్దును తెరుస్తారు.
ఖాట్మండ్: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండో-నేపాల్ సరిహద్దును మూసివేసినట్లు పోలీసులు సోమవారం ప్రకటించారు. యూపీ రెండో దశ ఎన్నికలు ఫిబ్రవరి 15న జరగనున్నాయి.
అదే రోజున శాసనసభకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన రోజు రాత్రి 7 గంటలకు సరిహద్దును తెరుస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకే సరిహద్దును మూసివేసినట్లు వారు పేర్కొన్నారు.

నేపాల్ లోని కంచన్ పూర్ జిల్లాలో బెల్దాండి, త్రిభువన్ బస్తీ లలోని సరిహద్దులను మూసివేసినట్లు కంచన్ పూర్ డీఎస్పీ నైన్ సింగ్ కర్కీ తెలిపారు. ఎన్నికల సమయంలో సరిహద్దును మూసివేయడం సాధారణమేనని, సంఘ విద్రోహక శక్తులను అరికట్టేందుకే బోర్డర్ ను మూసివేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications