ఇండోనేసియా భూకంపం: 42కు పెరిగిన మృతులు -వందల ఇళ్లు ధ్వంసం -చీకట్లో సులవేసి దీవి
ఆగ్నేయాసియాలో అత్యధిక జనాభా కలిగిన ఇండోనేసియా దేశంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. సులవేసి దీవిలో చోటుచేసుకున్న ఈ విపత్తులో మృతుల సంఖ్య 42కు పెరిగింది. భూకంపం ధాటికి పెద్ద సంఖ్యలో ఇళ్లు నేలమట్టమై.. వందలాది మంది గాయపడ్డారు. భవన శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. వివరాల్లోకి వెళితే..
Recommended Video

ప్రపంచంలోనే అతి పెద్ద దీవుల్లో ఒకటిగా, ఇండోనేసియాలో అంతర్బాగంగా ఉన్న సులవేసి దీవిలో.. స్థానిక కాలమానం ప్రకారం.. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత భూకంపం సంభవించింది. 6.2 తీవ్రతతో దాదాపు 7 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపం ధాటికి 62 భవనాలు కుప్పకూలినట్లు ఇండోనేసియా డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూకంపం సంభవించడంతో చాలా మంది శిథిలాల కిందే చిక్కుకుపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇండోనేసియా భూకంపం ధాటికి ఇప్పటివరకు 42 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఏజెన్సీ చీఫ్ డార్నో మజీద్ తెలిపారు. భవనాలు నేలమట్టమవడంతో చాలా మంది చిక్కుకుపోయారని, దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు చెప్పారు. డిజాస్టర్ ఏజెన్సీ సమాచారం ప్రకారం.. మజెని ప్రాంతంలో 637 మంది, మముజు ప్రాంతంలో 20 మందికి పైగా గాయపడ్డారు. ప్రకంపనల కారణంగా విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో సులవేసి దీవిలోని చాలా ప్రాంతాలు ఇంకా చీకట్లోనే ఉండిపోయాయి. కాగా..

గురువారం కూడా ఇదే ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూమి కంపించింది. ఇక్కడ గడిచిన 24 గంటల్లో 26 సార్లు భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో మూడు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 'రింగ్ ఆఫ్ ఫైర్' ఇండోనేసియాలో భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి. 2018లో ఇదే సులవేసి దీవిలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి సునామీ వచ్చింది. ఆ ప్రకృతి విపత్తులో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications