Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారీ వరదలు: 21 మంది మృతి

జకార్తా: ఇండోనేసియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ దేశంలోని సుమత్ర ద్వీపంలో కుండపోత వర్షాల కారణంగా తలెత్తిన వరదలతో 21 మంది మృతి చెందారు. మరో ఏడుగురు గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. ద్వీపం పశ్చిమ భాగంలోని పెసిసిర్‌ సెలటన్‌ జిల్లాలో నది ఉప్పొంగడం వల్ల టన్నుల కొద్దీ మట్టి, బండరాళ్లు నివాసాల్లోకి వచ్చినట్లు విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు.

కుంభవృష్టి వర్షం కారణంగా భారీ వృక్షాలు కూడా నేలకొరిగినట్లు చెప్పారు. పట్టణాలు, గ్రామాల్లోకి మోకాళ్ల లోతున వరద నీరు చేరింది. బోట్ల సాయంతో వర్షంలోనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. వరద ఉద్ధృతితో రహదారులన్ని నదులను తలపిస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా రెండు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.

Indonesia Floods 21 killed 6 Missing in Landslides

గల్లంతయిన ఏడుగురి కోసం సిబ్బంది గాలిస్తున్నట్లు, సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, గురువారం నుంచి పడాంగ్‌ సహా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి దాదాపు 200 ఇళ్లు నేలమట్టం అయినట్లు వెల్లడించారు. పలుచోట్ల వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నాయి. కొండచరియలు విరిగిపడి చాలా మార్గాలు మూసుకుపోయినట్లు అధికారులు తెలిపారు.

మెరుపు వరదలతో సుతేరా ఉప జిల్లాలో 200 కుటుంబాలున్న గ్రామానికి ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వరద నీరు తగ్గుముఖం పట్టినా కొండచరియల శిథిలాల కారణంగా సహాయ కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఇండోనేషియా ప్రభుత్వం వెల్లడించింది. సుమత్ర ప్రావిన్స్‌లోని 9 జిల్లాల్లో 20 వేల ఇళ్లు ఈ భారీ వర్షాల కారణంగా నీటిలో మునిగినట్లు అధికారుల తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+