ఎలాన్ మస్క్ "గ్రోక్" కి బిగ్ షాక్.. ఆ దేశంలో తాత్కాలిక నిషేధం !!
మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ రోజురోజుకీ మరింత అభివృద్ధి చెందుతోంది. కానీ అందులో మంచితో పాటు రిస్క్స్, మిస్యూస్ కూడా పెరిగిపోతున్నాయి. అందుకు ఇటీవల కాలంలో ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది "గ్రోక్". ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన 'ఎక్స్' ప్లాట్‌ఫామ్ ఏఐ చాట్ బాట్ గా గ్రోక్ పేరు తెచ్చుకుంది. ఫోటో ఎడిటింగ్ ని చాలా సింపుల్ చేసిన ఈ ఏఐ బాట్.. జనరేటివ్ ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీ, డిజిటల్ కన్సెంట్ వంటి వాటితో మహిళలకు తీవ్ర ఇబ్బందులు మిగిల్చింది. ఈ వ్యవహారంపై ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం నడుస్తూనే ఉంది.
ఈ క్రమంలోనే కృత్రిమ మేధ (AI) టూల్స్‌తో సృష్టిస్తున్న అసభ్యకర కంటెంట్ ఆన్‌లైన్‌లో విపరీతంగా పెరిగిపోవడంపై భారత్ సహా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, 'గ్రోక్' (Grok) చాట్‌బాట్ వినియోగంపై తాత్కాలిక నిషేధం విధించిన తొలి దేశంగా ఇండోనేసియా నిలిచింది. దీంతో ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ఇండోనేసియా మంత్రి మోత్యా హఫీద్ మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లోని అసభ్యకర కంటెంట్‌ను మానవ హక్కులు, గౌరవం, పౌరుల భద్రతలకు ఉల్లంఘనగా తమ ప్రభుత్వం భావిస్తుందన్నారు. మహిళలు, చిన్నారులు సహా సమాజ రక్షణకే ఈ చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. అధిక ముస్లిం జనాభా ఉన్న ఇండోనేసియా, ఆన్‌లైన్ అశ్లీలత కట్టడికి కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.
మరోవైపు గ్రోక్ చాట్‌బాట్‌లో అశ్లీల కంటెంట్‌పై భారత్ గతంలోనే తీవ్రంగా స్పందించింది. అటువంటి కంటెంట్‌ను వెంటనే తొలగించి, తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని Xని ఆదేశించింది. X నివేదించినా, భారత ప్రభుత్వం మరింత సమాచారం కావాలని కోరింది. ఈ పరిణామాల మధ్య, ఎక్స్ తన గ్రోక్ చాట్‌బాట్‌లో ఇమేజ్ జనరేషన్‌పై పరిమితి విధించింది. ఇకపై అది కేవలం ప్రీమియమ్ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.












Click it and Unblock the Notifications