పాకిస్థాన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ: జిన్నా ఆశయాలే లక్ష్యం

పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ ఆశయాలను నెరవేర్చే దిశగా తమ పార్టీ కొనసాగుతుందని ఏఏపి ఛైర్మన్ అర్సలాన్ ఉల్ ముల్క్ ఈ సందర్భంగా తెలిపారు. భారతదేశంలోని ఏఏపి చీఫ్ అరవింద్ కేజ్రివాల్ తరహాలో తాము కూడా ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా వచ్చే వారం పంజాబ్ అసెంబ్లీ బయట నిరాహార దీక్ష చేయనున్నట్లు ముల్క్ పేర్కొన్నారు.
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుతున్న నేపథ్యంలో తాము దీక్ష చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. పోలీస్ సంస్కరణలు, హింసా వ్యతిరేక బిల్లు 2014ను అమలు చేయాలనే డిమాండ్లతో ఈ దీక్ష పూనుకోనున్నట్లు ముల్క్ చెప్పారు. మహ్మద్ అలీ జిన్నా ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా తాము పనిచేస్తామని, ప్రజలందరికీ స్వాతంత్ర్య ఫలాలు అందజేయడానికి కృషి చేస్తామని తెలిపారు.
ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నిరసన తెలిపినందుకు 20 మంది పార్టీ కార్యకర్తలతోపాటు తానూ ఇటీవల జైలు పాలైనట్లు ముల్క్ చెప్పారు. పోలీసుల వేధింపులు, ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా తాము త్వరలో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు అర్సలాన్ ఉల్ ముల్క్ తెలిపారు.












Click it and Unblock the Notifications