
ఇన్‌స్టా రిచ్ లిస్ట్, రొనాల్డొ టాప్ ర్యాంక్, ఎగబాకిన కోహ్లి, పడిపోయిన ప్రియాంక చోప్రా ర్యాంక్
సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్ట్రాగ్రామ్ ఏటా రిచ్ లిస్ట్ రిలీజ్ చేస్తోంది. స్పోర్ట్స్ పర్సనాలటీ/ సినీ తారలు ఇందులో ఉంటారు. ఒక్కో పోస్టుకు ఇన్‌స్టా కొంత మొత్తం ఇస్తోంది. ఈ సారి కూడా 30 మందితో కూడిన లిస్ట్ విడుదల చేసింది. అందులో క్రిస్ట్రియనో రొనాల్డొ అగ్రస్థానంలో నిలిచారు. బాలీవుడ్ నుంచి ప్రియాంక చోప్రాకు చోటు దక్కగా.. క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా రిచ్ లిస్ట్‌లో వరసగా చోటు దక్కించుకున్నారు.

ఒక్కో పోస్టుకు రూ. 11.9 కోట్లు
ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఫ్యాన్ ఫాలొయింగ్ ఎక్కవగా ఉన్నవారికి.. వారి చేసే పోస్టుకు అందిన స్పందన ఆధారంగా ర్యాంకింగ్ ఇస్తున్నారు. ఈ సారి ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియనో రొనాల్డో టాప్ ప్లేస్‌లో నిలిచారు. తర్వాతి స్థానాల్లో హాలీవుడ్ సూపర్ స్టార్ జాన్సన్, పాప్ సెన్సేషన్ ఆరియానా నిలిచారు. రొనాల్డొకు 308 మిలియన్ల ఫాలొవర్లు ఉన్నారు. అతను చేసే ఒక్కో పోస్టుకు ఇన్ స్ట.. రూ.11.9 కోట్ల మొత్తాన్ని అందజేస్తోంది.

కోహ్లికి రూ.5 కోట్లు
తర్వాత జాన్సన్ 11.3 కోట్లు, ఆరియానా 11.2 కోట్లను తీసుకుంటున్నారు. నాలుగో స్థానంలో ఇన్ స్ట సెన్సేషన్ మొఘుల్ జెన్నెర నిలిచారు. తర్వాత సెలెనా, కిమ్ కర్దాషిన్, లియోనిల్ మెన్సీ, బెయాన్సే ఉన్నారు. ఇక మన దేశానికి వస్తే విరాట్ కోహ్లి టాప్ 20లో చోటు దక్కించుకున్నారు. గతేడాద 23వ స్థానంలో ఉండగా.. ఈ సారి 19 ప్లేస్‌కి వచ్చారు. అతను చేసే ఒక్కో పోస్టుకు ఇన్ స్ట రూ.5 కోట్లు అందజేస్తోంది. విరాట్ తరువాత అమెరికా సింగర్ రాపర్ కార్డీ బీ, డెమి లొవాటో నిలిచారు.

దిగజారిన ప్రియాంక ర్యాంక్
ప్రియాంక చోప్రా కూడా టాప్-30లో చోటు దక్కింది. 27వ స్థానంలో ఆమె నిలిచారు. ఒక్కో పోస్టుకు రూ.3 కోట్ల చొప్పున ఇస్తారు. గతేడాది ప్రియాంక చోప్పా 19వ స్థానంలో ఉండగా.. ఈ సారి 8 స్థానాలు పడిపోయారు. ఈ సారి హ్యారీ పొటర్ ఫేమస్ యాక్టర్ ఎమ్మా వాట్సాన్, ఫుట్ బాల్ ప్లేయర్ డేబిడ్ బెక్ హోమ్ కన్నా ముందు నిలిచారు. ఇదీ కాస్త ప్లస్ పాయింట్‌గా నిలువనుంది.