Viral Video: ఉక్రెయిన్ సైనికుడి ప్రాణాలు కాపాడిన ఐఫోన్.. ఎలాగంటే..
గత కొద్ది నెలలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్దం జరుగుతోంది. రష్యా బాంబులతో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. అయితే ఓ ఉక్రెయిన్ సైనికుడుని ఐ ఫోన్ కాపాడింది. ఐఫోన్ సైనికుడి ప్రాణాలను ఎలా కాపాడిందో వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెడ్డిట్‌లో ఈ వీడియో పోస్ట్ చేశారు.

ఐ ఫోన్ కు బుల్లెట్..
ఈ వీడియోలో ఉక్రెనియన్ సైనికుడు తన బ్యాక్‌ప్యాక్ నుంచి ఐఫోన్‌ను బయటకు తీస్తున్నాడు. డ్యామేజ్ అయిన ఫోన్ లోపల బుల్లెట్ ఇరుక్కుపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. వైరల్‌గా మారిన వీడియో గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వీడియోపై పలువురు వినియోగదారులు స్పందించారు.

నెటిజన్ల స్పందన
"ఒక యాపిల్ ఒక రోజు డాక్టర్ని దూరంగా ఉంచుతుంది!" అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఏప్రిల్ 2022లో ఉక్రెయిన్‌లో ఇదే విధమైన సంఘటన ఒకటి జరిగింది. ఉక్రెనియన్ సైనికుడిపై రష్యన్ దళాలు కాల్పులు జరిపాయి. అయితే అతని ఐఫోన్ మొత్తం డ్యామేజ్ కావడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. వైరల్ వీడియోలో సైనికుడు తన ఐఫోన్‌లో బుల్లెట్ చిక్కుకున్నట్లు చూపించాడు."స్మార్ట్‌ఫోన్ నా ప్రాణాన్ని కాపాడింది" అని అన్నాడు.
ఆర్థిక వ్యవస్థలో అలజడి
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అలజడి రేపింది. ఇంధనం, ఆహార ధరలను పెరిగాయి. ధాన్యం, ఇంధనం, ఎరువులు వంటి కీలకమైన రష్యన్ ఉత్పత్తుల దిగుమతులను చాలా దేశాలు తగ్గించాయి.












Click it and Unblock the Notifications