Fattah 2 హైపర్‌ సోనిక్ మిస్సైల్- ఇరాన్ చేతిలో బ్రహ్మాస్త్రం

ఇరాన్‌పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వరకే ఇది పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాలకూ పాకింది. భారతీయులు.. ప్రత్యేకించి తెలుగువాళ్లు ఎక్కువగా నివసించే కువైట్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ వంటి దేశాలపైనా దాడులు సాగాయి. బహ్రెయిన్ లో ఏకంగా అమెరికా నావల్ బేస్ సైతం ఇరాన్ సంధించిన శక్తిమంతమైన మిస్సైళ్ల ధాటికి భస్మీపటలం అయింది.

ఈ పరిణామాల మధ్య ఇరాన్ హైపర్‌సోనిక్ క్షిపణి తెరమీదికి వచ్చింది. ముఖ్యంగా ఫత్తా-2. ఇది- ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మిస్సైల్ ను గేమ్ ఛేంజర్ గా అభివర్ణిస్తోంది ఇరాన్. శతృ దేశాల గుండెల్లో గుబులు పుట్టించేంత శక్తి సామర్థ్యాలు దీనికి ఉన్నాయని చెబుతోంది. శతృ దేశాల రక్షణ వ్యవస్థను తుత్తునీయలు చేస్తూ వాటి భూభాగంపైకి చొచ్చుకుపోయి దాడి చేయగలదని, పరిస్థితులను బట్టి దీన్ని ప్రయోగించే అవకాశాలను పరిశీలిస్తోన్నట్లు తెలిపింది.

Iran Fattah 2 Mach 15 Speeds and 1500 km Range Pose Major Challenges for US and Israel Defenses

2023 నవంబర్ లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఫత్తా 2ను ఆవిష్కరించింది. ఫత్తా-1 కు ఇది కొనసాగింపు. అత్యధిక వేగం దీని సొంతం. అందుకే దీనికి హైపర్‌సోనిక్ గ్లయిడెడ్ వెహికల్ గా పిలుస్తారు. ఈ క్షిపణి మాక్ 15 వేగంతో 1,500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని, 200 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లి భూ, నావికా లక్ష్యాలను ఛేదించగలదని ఇరాన్ పేర్కొంటోంది.

ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ వివరాల ప్రకారం- ఫత్తా 2 వంటి సామర్థ్యాలు కార్యరూపం దాల్చితే, అవి అమెరికన్ విమాన వాహక నౌకలు, అలాగే మాక్ 3.5 ఎస్ఎం-6 వంటి ఇంటర్‌సెప్టర్లపై ఆధారపడే ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ వ్యవస్థలకు తీవ్రమైన సవాలును విసురుతాయనడంలో సందేహాలు అక్కర్లేదు. హైపర్‌సోనిక్ క్షిపణి రాడార్ వ్యవస్థలకు సైతం అందదు. దీన్ని ట్రాక్ చేయడం వాటి తరం కాదు.

తమ దేశంపై జరిగే దాడులకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరిస్తోన్న నేపథ్యంలో.. ఫత్తా-2, ఇతర అధునాతన ఆయుధాలను వినియోగించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంపై స్వీయ నిర్బంధాన్ని పాటిస్తోంది. వీటి గరిష్ట రేంజ్.. 2,000 కిలోమీటర్లు. ఈ పరిధి మధ్యప్రాచ్యం మొత్తాన్ని, తూర్పు యూరప్‌లోని కొన్ని ప్రాంతాలను చేరుకోగలదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+