మీ చావు మీరు చావండి: అన్ని గేట్లు మూసేసిన ఇరాన్..
ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. నెక్ట్స్ ఏం జరుగుతుందా..? అని నిమిషం నిమిషం ఉత్కంఠభరితంగా మారుతోంది. ఈ రాత్రికి ఇరాన్ నాగరికతను అంతం చేస్తామని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శపథం చేశారు. ప్రపంచ చరిత్రలోనే ఈ రాత్రి కీలకంగా మారనుందని వెల్లడించారు. ఇరాన్ ను భూస్థాపితం చేయడం తనకు ఇష్టం లేదని.. కానీ చేయక తప్పట్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇరాన్ కూడా స్ట్రాంగ్ గా బదులిచ్చింది. తమపై దాడులకు పాల్పడితే మరచిపోలేని దెబ్బ కొడతామని ఇరాన్ తేల్చి చెప్పింది. ఈ మేరకు ట్రంప్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రాత్రి ఏం జరుగుతుందోనన్న ఆందోళన పెరిగిపోతుంది.
ఇక అమెరికా నుంచి అన్ని సంబంధాలను కట్ చేసుకుంటూ ఇరాన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో జరుగుతున్న సంధి చర్చలకు సంబంధించిన ద్వారాలను పూర్తిగా మూసివేసింది ఇరాన్. అలాగే అమెరికాతో ఉన్న అన్ని దౌత్య, పరోక్ష సంభాషణ మార్గాలను సైతం క్లోజ్ చేసింది. దాంతో అమెరికా- ఇరాన్ మధ్య సందేశాల మార్పిడి కూడా నిలిచిపోయింది. ఈ క్రమంలో హార్మూజ్ జలసంధిని తెరవాలంటూ ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ ఇప్పటికే ముగిసింది. దాంతో ఇక హార్మూజ్ జలసంధి తెరుచుకోవడం ఇప్పట్లే లేనట్టేనన్న అనుమానం వ్యక్తం అవుతోంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ మంగళవారం రాత్రి 8 గంటలకు ముగిసింది. దాంతో ఇరాన్ లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై ట్రంప్ చెప్పినట్లుగానే దాడికి పాల్పడతారని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలో క్షణం క్షణం ఉత్కంఠంగా మారింది. ఇక పవర్ ప్లాంట్స్ పై అమెరికా దాడులు చేస్తే ఆ దేశం మొత్తం అంధకారం అవుతుందని ఇరాన్ అంటోంది. తాజా పరిణామాలు ప్రపంచ దేశాల్ని వణుకు పుట్టిస్తున్నాయి. యుద్ధం తీవ్రరూపం దాల్చితే ఎనర్జీ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
BREAKING:
— Globe Eye News (@GlobeEyeNews) April 7, 2026
Iran has closed all diplomatic and indirect channels of communication with the US, suspending the exchange of messages, following Trump’s threat to destroy Iran’s entire civilization. pic.twitter.com/3751RDV4OO
మరోవైపు ట్రంప్ హెచ్చరికల దృష్ట్యా ఇరాన్ లోని భారతీయులకు కేంద్ర విదేశాంగ శాఖ కీలక అడ్వైజరీ జారీ చేసింది. రాబోయే 48 గంటలు ఉన్న చోటే ఉండాలని ఇరాన్ లోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. విద్యుత్ కేంద్రాలు, సైనిక స్థావరాలు, అపార్ట్‌మెంట్ పై అంతస్తులకు దూరంగా ఉండాలని ఎంబసీ సూచనలు చేసింది. అలాగే హైవేలపై వెళ్లాలనుకుంటే తప్పనిసరిగా ఎంబసీతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. తాము ఏర్పాటు చేసిన హోటళ్లలో ఉన్నవాళ్లు.. అక్కడే ఉన్న ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ అక్కడే ఉండాలని సూచనలు చేసింది.
-
ప్రపంచ చరిత్రలోనే ఈ రాత్రి కీలకం: ట్రంప్ సంచలనం -
రానున్న 12 గంటలు రైలులో ప్రయాణం చేయకండి: ప్రజలకు కీలక హెచ్చరికలు -
కోటీ 40 లక్షల మంది ఆత్మత్యాగానికి రెడీ-ట్రంప్ డెడ్ లైన్ వేళ ఇరాన్ అధ్యక్షుడి షాకింగ్..! -
ట్రంప్ స్ధానంలో తెలుగింటి అల్లుడు ? అమెరికాలో మారుతున్న లెక్కలు..! -
హార్మూజ్ తెరవండ్రా : ఇరాన్ పై బూతులతో రెచ్చిపోయిన ట్రంప్ -
Iran: ఆ పైలట్ కోసం ఓ విమానం, రెండు ఛాపర్లు పోగొట్టుకున్న అమెరికా? ఇరాన్ షాకింగ్..! -
అమెరికాతో 45 రోజుల సీజ్ ఫైర్? ఇరాన్ కీలక షరతు-పాక్ మధ్యవర్తిత్వం..! -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ట్రంప్ అవుట్! అధ్యక్ష పదవి నుంచి తొలగింపు? -
యుద్ధ చరిత్రలో నిలిచిపోయే సాహసం! ఇరాన్ పర్వతాల్లో 'డెడ్లీ' ఆపరేషన్ -
ఇరాన్ అతిపెద్ద అణు కేంద్రం నుంచి భారీ లీక్- ఐరాసకు లేఖ -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం!











Click it and Unblock the Notifications