గల్ఫ్ దేశాలపై అగ్ని వర్షం: కువైట్ సహా..!!

ఇరాన్‌పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వరకే ఇది పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాలకూ పాకింది. భారతీయులు.. ప్రత్యేకించి తెలుగువాళ్లు ఎక్కువగా నివసించే కువైట్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ వంటి దేశాలపైనా దాడులు సాగాయి. బహ్రెయిన్ లో ఏకంగా అమెరికా నావల్ బేస్ సైతం ఇరాన్ సంధించిన శక్తిమంతమైన మిస్సైళ్ల ధాటికి భస్మీపటలం అయింది.

ఇరాన్, ఇజ్రాయెల్, బహ్రెయిన్, యూఏఈ, ఖతార్‌లపై ఏకకాలంలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్‌ల సంయుక్త దాడికి ప్రతీకారంగా ఈ చర్యకు దిగింది. ఈ దాడులు.. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలను మరింత పెంచాయి. అమెరికా, ఇజ్రాయెల్‌ జాయింట్ గా ఇరాన్‌లోని కీలక స్థావరాలపై దాడులు చేయగా.. దీనికి ప్రతిదాడికి దిగింది ఇరాన్. బహ్రెయిన్‌లోని యూఎస్ నేవీ బేస్ ను ధ్వంసం చేసిపడేసింది.

Iran Launches Ballistic Missiles at Israel Bahrain UAE Kuwait Qatar in Retaliation to US-Israel Strike

యూఏఈ రాజధాని అబుదాబిలో పేలుళ్లు వినిపించాయి. ఖతార్ పైనా క్షిపణుల వర్షం కురిసింది ఇరాన్ వైపు నుండి. కొన్ని గంటల తర్వాత ఓ క్షిపణిని ఖతర్ ఇంటర్ సెప్ట్ చేసింది. అబుదాబిలోని యూఎస్ ఎయిర్ బేస్‌లు, ఖతార్‌లోని దోహా లక్ష్యం అయ్యాయో లేదో వెంటనే స్పష్టంగా తేలలేదు. అబుదాబిలోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్‌ను యూఏఈ ఎయిర్ ఫోర్స్, యూఎస్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఉపయోగిస్తున్నాయి. దోహాలోని 24 హెక్టార్ల అల్ ఉదీద్ ఎయిర్ బేస్ యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది.

ఈ కారణంతో ఇరాన్.. ఆయా దేశాలపై క్షిపణుల దాడులకు పూనుకుంది. అమెరికా బేస్ సెంటర్లే వాటి లక్ష్యం అయినప్పటికీ.. పలు చోట్ల సాధారణ, పౌర, ప్రైవేటు ఆస్తులను నష్టం వాటిల్లినట్లు సమాచారం అందింది. తమ దేశంపై జరిగిన దాడులను బహ్రెయిన్ నిర్ధారించింది. తమ దేశంలోని యూఎస్ నేవీ 5వ బేస్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి జరిగిందని తెలిపింది.

తొలుత ఇజ్రాయెల్‌పై దాడికి దిగింది ఇరాన్. 35 నుంచి 70 క్షిపణులను ప్రయోగించింది. ఆ తర్వాత అమెరికా నావల్ బేస్ స్థావరంపై దాడికి పాల్పడింది. బహ్రెయిన్ అంతర్గత భద్రతా మంత్రిత్వ శాఖ సైతం నివాసితులను అప్రమత్తం చేయడానికి సైరన్‌ను ఆన్ చేసింది. బహ్రెయిన్ ఒక్కటే కాదు, ఇరాన్ క్షిపణులతో దాడికి గురైన అమెరికా స్థావరం కాదు. ఖతార్‌లోని అల్ ఉడెయిడ్ ఎయిర్ బేస్, కువైట్‌లోని అల్ సలెం ఎయిర్ బేస్, జోర్డాన్‌లోని మువఫాక్ అల్-సల్టీ బేస్ వంటి పలు ఇతర స్థావరాలపై కూడా దాడులు జరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+