రంజాన్ వేళ జెరుసలేమ్ పై ఇరాన్ క్షిపణి దాడి..(వీడియో)
పవిత్ర ఈద్ అల్-ఫితర్ రోజున.. ఇరాన్ క్షిపణి జెరూసలెంలోని అల్-అక్సా మసీదుకు సమీపంలో దాడి చేసింది. ముస్లింలు, క్రైస్తవులు, యూదులకు అత్యంత పవిత్రమైన స్థలాలకు వందల మీటర్ల దూరంలో జరిగిన ఈ దాడిని ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది.
ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేస్తూ.. "ఈద్ అల్-ఫితర్ సందర్భంగా జెరూసలెంలో అత్యంత పవిత్ర స్థలాలకు కొన్ని వందల మీటర్ల దూరంలో ఇరాన్ క్షిపణి పడింది. ముల్లాలు తమను తాము 'మతవాదుల' గా చెప్పుకునే ప్రభుత్వ నిజ స్వరూపం ఇదే" అని వివరించింది.
An Iranian missile struck Jerusalem during Eid al-Fitr, a few hundred meters from the holiest sites for Muslims, Christians and Jews.
— Israel Foreign Ministry (@IsraelMFA) March 21, 2026
This is the true face of the Mullahs’ so called ‘religious’ regime. pic.twitter.com/m6gG03ZrqR
అంతకుముందు మార్చి 16న ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల శకలాలు, ఇజ్రాయెల్ అడ్డుకున్న క్షిపణుల శిథిలాలు జెరూసలెం ప్రాచీన నగర గోడల చుట్టూ, క్రైస్తవ, ముస్లిం, యూదు పవిత్ర స్థలాల వద్ద పడ్డాయి. చర్చి ఆఫ్ ది హోలీ సెపల్చర్ లేదా అల్-అక్సా ప్రాంగణం, టెంపుల్ మౌంట్ వద్ద ఎటువంటి ప్రాణనష్టం లేదా భారీ నష్టం జరగలేదు.

పోలీసులు విడుదల చేసిన ఫోటోలో.. చర్చి ఆఫ్ ది హోలీ సెపల్చర్ పక్కన ఉన్న పైకప్పు నుండి క్షిపణికి చెందిన పెద్ద లోహపు భాగాన్ని అధికారులు తీసుకెళ్లారు. అల్-అక్సా ప్రాంగణంలోని స్వర్ణ రంగు డోమ్ ఆఫ్ ది రాక్ వద్ద చిన్న శకలాలు చెల్లాచెదురుగా పడటంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు మూసివేశారు. ఇక గత 20 రోజులుగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులను ఉద్ధృతం చేసింది.












Click it and Unblock the Notifications