కోటీ 40 లక్షల మంది ఆత్మత్యాగానికి రెడీ-ట్రంప్ డెడ్ లైన్ వేళ ఇరాన్ అధ్యక్షుడి షాకింగ్..!

ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ప్రారంభించిన యుద్దం రెండో నెలలోకి ప్రవేశించినా ఎలాంటి ఫలితం సాధించలేకపోవడంతో ట్రంప్ ఇప్పుడు సంచలన నిర్ణయాలకు సిద్దమయ్యారు. హార్ముజ్ జలసంధి విషయంలో తమతో ఒప్పందం చేసుకోకపోతే మొత్తం ఇరాన్ ను 48 గంటల్లో సర్వనాశనం చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలు అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ట్రంప్ డెడ్ లైన్ సమీపిస్తున్న తరుణంలో ఇరాన్ డోంట్ కేర్ హెచ్చరికలు చేసింది.

హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంపై అమెరికా విధించిన గడువుకు ముందు ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, దేశాన్ని రక్షించుకోవడానికి 14 మిలియన్లకు పైగా పౌరులు తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సుముఖత వ్యక్తం చేశారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ సంచలన ప్రకటన చేశారు. "14 మిలియన్లకు పైగా ఇరాన్ ప్రజలు తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఎక్స్ లో ఆయన ప్రకటించారు. నేను కూడా ఇరాన్ కోసం నా ప్రాణాలను అర్పించడానికి గతంలోనూ, ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాను, ఇకపైనా కూడా సిద్ధంగానే ఉంటానని పెజెష్కియాన్ తేల్చిచెప్పేశారు.

Iran President Warns 14 Million Ready To Sacrifice as Trump s Strike Deadline Looms

హార్ముజ్ జలసంధి గుండా నౌకాయానానికి అనుమతి ఇచ్చేలా ఒప్పందం చేసుకోవాలంటూ ఇరాన్‌కు ట్రంప్ విధించిన గడువు సమీపిస్తున్న తరుణంలో పెజెష్కియాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే గడువు సమీపిస్తున్నా.. ఇరాన్ వెనక్కి తగ్గే సంకేతాలు చూపట్లేదు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరగవచ్చనే భయాల నేపథ్యంలో.. ఇరాన్ లోని విద్యుత్ ప్లాంట్లు సహా కీలక ప్రదేశాల చుట్టూ మానవ గొలుసులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యువతకు పిలుపునిచ్చింది. మరోవైపు ఇరాన్ ఇప్పటికే ట్రంప్ కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించి, దానికి బదులుగా ఈ సంఘర్షణకు శాశ్వత ముగింపు పలకాలని పిలుపునిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+