Hormuz: హార్ముజ్ లో అసలు నష్టం భారత్ కే? కేంద్రం షాకింగ్ ..!
ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్దం రెండో నెలకు చేరుకుంది. ఈ యుద్దంలో ముందుగా ఇరాన్ నాయకత్వాన్ని తుడిచిపెడితే చాలని భావించిన ప్రత్యర్దులకు హార్ముజ్ జలసంధిని మూసేసి ఎదురు ఒత్తిడి పెట్టే స్దితికి ఆ దేశం చేరుకుంది. దీంతో ఇప్పుడు హార్ముజ్ జలసంధిని (strait of hormuz)తెరిపించేందుకు అంతర్జాతీయంగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో బ్రిటన్, భారత్ తో పాటు మొత్తం 35 దేశాలు ఏకతాటిపైకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో నిన్న ఈ 35 దేశాల ప్రతినిధులు వర్చువల్ గా భేటీ అయి హార్ముజ్ జలసంధిని తెరిపించే మార్గాలపై చర్చించారు. ఈ భేటీలో హార్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో తమకు ఎదురవుతున్న కష్టాల్ని పలు దేశాలు ఏకరువు పెట్టాయి. ఇందులో భారత్ కూడా ఉంది. మన దేశం తరఫున ఈ భేటీకి వర్చువల్ గా హాజరైన విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ .. హార్ముజ్ జలసంధిలో నావికుల్ని కోల్పోయిన ఏకైక దేశం తమదే అంటూ వాపోయారు. హార్ముజ్ జలసంధి ద్వారా రాకపోకలను పునరుద్ధరించడం, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను పరిష్కరించడంపై జరిగిన ఈ భేటీలో మిస్రీ ఈ ప్రకటన చేశారు.

బ్రిటన్ నిర్వహించిన ఈ అంతర్జాతీయ వేదికపై 60కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ వర్చువల్ సమావేశంలో సముద్రంలో స్వేచ్ఛా నౌకాయానాన్ని కొనసాగించడం, ప్రపంచ సముద్ర మార్గాల ద్వారా నిరంతరాయ రాకపోకలను నిర్ధారించడం యొక్క ఆవశ్యకతపై చర్చించారు. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఘర్షణలపై భారత్ తన వైఖరిని కుండబద్దలు కొట్టింది. ఉద్రిక్తతలను తగ్గించడం, చర్చలు, దౌత్యపరమైన సంప్రదింపులకు తిరిగి రావడం ద్వారానే పరిస్థితిని పరిష్కరించగలమని మిస్రీ సూచించారు. ఈ సంఘర్షణ భారతదేశ ఇంధన అవసరాలపై తీవ్ర భారం మోపిందని, గల్ఫ్‌లో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడుల్లో కేవలం భారతీయ నావికులు మాత్రమే మరణించారని మిస్రీ పేర్కొన్నారని విదేశాంగమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
-
F-35 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్.. అమెరికాలో చేయి దాటిన పరిస్థితి! -
ట్రంప్ దెబ్బకు తలవంచిన ఇరాన్..? ఎట్టకేలకు కాళ్లబేరానికి..? -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
ఇజ్రాయెల్ భీకర ప్రతీకారం: హిజ్బుల్లా మాస్టర్‌మైండ్ హతం! -
Iran War: సీజ్ ఫైర్ పై తేల్చేసిన ఇరాన్..! ట్రంప్ కు ఘాటు కౌంటర్..! -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
ఇరాన్ వార్ లోకి రెండు గల్ఫ్ దేశాలు? ట్రంప్ వైఫల్యం వేళ బిగ్ ట్విస్ట్..! -
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
ఆంజనేయుడి దివ్యమంత్రం -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ














Click it and Unblock the Notifications