Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..!

ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడిగా ప్రారంభించిన యుద్దం రెండో నెలకు చేరిపోయింది. అయినా ఇప్పటికీ ఇరాన్ ప్రతిఘటన ఆగడం లేదు. అదే సమయంలో అమెరికా-ఇజ్రాయెల్ పై ప్రపంచ దేశాల ఒత్తిడి పెంచే లక్ష్యంతో కీలకమైన హార్ముజ్ జలసంధి(strati of hormuz)ని ఇరాన్ మూసేస్తోంది. దీంతో అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ ధరలు మండుతున్నాయి. దీంతో అమెరికాకు ప్రత్యామ్నాయంగా మరో పెద్దన్న బ్రిటన్ హార్ముజ్ జలసంధిని తెరిపించేందుకు ఏకంగా 35 దేశాల కూటమిని ఏర్పాటు చేసింది. ఇందులో చేరాలని భారత్ ను కూడా ఆహ్వానించింది.

ఇవాళ బ్రిటన్ నేతృత్వంలో 35 దేశాల ప్రతినిధులు హార్ముజ్ జలసంధిని తెరిపించే విషయంలో చర్చించేందుకు సమావేశమయ్యాయి. ఈ భేటీలో పాల్గొనాలని నిర్ణయించిన భారత్.. తమ ప్రతినిధిగా విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీని పంపింది. ఈ విషయాన్ని విదేశాంగశాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ ధృవీకరించారు. షిప్పింగ్ మార్గాలను తెరిచి ఉంచడానికి భారతదేశం కూడా ఇరాన్‌తో సహా మధ్యప్రాచ్యంలోని ప్రాంతీయ దేశాలతో సంప్రదింపులు జరుపుతోందని ఆయన తెలిపారు.

Hormuz Reopening India Joins UK s 35-Nation Summit with Vikram Misri Leading Delegation

తమ నౌకలకు నిరాటంకమైన, సురక్షితమైన రవాణాను ఎలా ఉత్తమంగా అందించగలమో తెలుసుకోవడానికి ఇరాన్, అక్కడి ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని రణ్ ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ సంప్రదింపులు ఇప్పటికే ఫలితాలనిస్తున్నాయని పేర్కొన్నారు గత కొన్ని రోజులుగా జరిపిన సంభాషణల ద్వారా ఆరు భారతీయ నౌకలు హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటగలిగాన్నారు. తాము సంబంధిత వర్గాలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామన్నారు. హార్ముజ్ జలసంధి విషయంలో చైనా, రష్యా, పాకిస్తాన్, భారత్ వంటి మిత్రదేశాలకు మాత్రం ఇరాన్ మినహాయింపు ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+