ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..!

ఇరాన్ పై ఇజ్రాయెల్ తో కలిసి ఏకపక్షంగా దాడులు ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్నా పురోగతి సాధించడంలో విఫలమైన అమెరికాకు ఇందులో నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో తీవ్ర అసహనంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump).. ఇరాన్ కు ప్రతిరోజూ హెచ్చరికలు చేస్తూ, డెడ్ లైన్లు పెడుతూ కాలం గడిపేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు 48 గంటల డెడ్ లైన్ పెట్టిన ట్రంప్.. మరోసారి వెనక్కి తగ్గేలా కనిపిస్తున్నారు.

ఇరాన్ లో మౌలిక సదుపాయాలపై భారీ దాడులు చేస్తానని హెచ్చరికలు చేసిన ట్రంప్ దానికి 48 గంటల గడువు పెట్టారు. అయితే ఆ గడువు భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రితో ముగియబోతోంది. దీంతో రేపు ఉదయానికి ఇరాన్ పై దాడులు చేయాల్సి ఉంది. అయితే తెరవెనుక చర్చలు జరుగుతున్నాయన్న కారణంతో మరోసారి ఈ దాడుల్ని వాయిదా వేసేందుకు ట్రంప్ సిద్దమవుతున్నట్లు సమాచారం అందుతోంది. చర్చల్లో పురోగతి ఉందని చెప్పి ఈ దాడుల్ని ట్రంప్ వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు ఆక్సియోస్ నివేదించింది.

Trump May Delay Iran Civilian Strikes if Negotiations Show Progress Officials Say

ఇరాన్ తో ఒప్పందం కుదురుతున్నట్లు భావిస్తే ట్రంప్ బహుశా దాడులను వాయిదా వేస్తారని, కానీ ఆ నిర్ణయం తీసుకునేది ఆయన మాత్రమేనని ఓ సీనియర్ అధికారి చెప్పినట్లు ఆక్సియోస్ తెలిపింది. దౌత్యం లేదా సైనిక ఉద్రిక్తతలలో ఏది నెగ్గుతుందో నిర్ణయించడంలో ట్రంప్ పోషిస్తున్న కీలక పాత్రను ఇది స్పష్టం చేస్తోంది. అయితే ట్రంప్ ఇరాన్‌కు మరింత గడువు ఇస్తారనే విషయంలో తమకు అనుమానాలు ఉన్నట్లు మరో రక్షణ అధికారి తెలిపారు. దీంతో చర్చలకు ఉన్న అవకాశాలు వేగంగా తగ్గిపోవచ్చని పేర్కొన్నారు. దౌత్య వ్యవహారాలు లేదా ట్రంప్ ఆలోచనా విధానంపై ప్రత్యక్ష అవగాహన ఉన్న ఆరుగురు అధికారులు, ఇతర వర్గాలతో జరిపిన ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక.. ఇవాళ రాత్రి 8 గంటల గడువు సమీపిస్తున్న తరుణంలో వైట్ హౌస్ ఎదుర్కొంటున్న నిర్ణయం ఎంత కీలకమైనదో స్పష్టం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+