పిచ్చెక్కిపోతున్న ట్రంప్ ? ఇరాన్ మొత్తం పేల్చేస్తా..! గల్ఫ్ కూ అదే గతన్న టెహ్రాన్..!
ఇరాన్ (iran)పై అకారణంగా యుద్దం ప్రారంభించిన అమెరికా-ఇజ్రాయెల్ కు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. యుద్దం రెండో నెలకు చేరుకున్నా ఎప్పట్లోగా ముగుస్తుందో చెప్పలేని పరిస్దితి. దీంతో ఓవైపు అణు దాడి భయాలు కూడా నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో మంగళవారం లోగా తనతో ఒప్పందం చేసుకోవాలని, లేకపోతే ఇరాన్ మొత్తాన్ని పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) చేసిన హెచ్చరికలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. దీనికి ఇరాన్ కూడా ఘాటు కౌంటర్ ఇచ్చింది.
మంగళవారం తన గడువు ముగిసేలోపు అమెరికాతో శాంతి ఒప్పందానికి రాలేకపోతే 'మొత్తం ఇరాన్‌ను పేల్చేస్తానని' డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ పౌరులకు అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలపై దాడి చేస్తానని ట్రంప్ బెదిరిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి పలు హెచ్చరికలు చేసిన ట్రంప్.. ఈసారి ఏం చేయబోతున్నారన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ట్రంప్ హెచ్చరికలపై స్పందించిన ఇరాన్ .. అదే జరిగితే ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలలోని మౌలిక సదుపాయాలపై కూడా ఇలాంటి దాడులతో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది.

అమెరికన్ మీడియా సంస్థలకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో ట్రంప్.. రాబోయే 48 గంటల్లో ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరకపోతే మేం మొత్తం దేశాన్ని పేల్చేస్తామని హెచ్చరికలు చేశారు. శాంతి ఒప్పందానికి అవకాశం ఉందని, వారు ఒప్పందం చేసుకోకపోతే అక్కడ ఉన్న ప్రతిదాన్నీ పేల్చేస్తానని ఆయన హెచ్చరించారు. ఇరాన్ పూర్తిగా నాశనమైపోయిందని, ప్రతిరోజూ పరిస్థితి మరింత దిగజారబోతోందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ట్రంప్ అల్టిమేటానికి ప్రతిస్పందనగా.. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. మీ దుందుడుకు చర్యలు అమెరికాలోని ప్రతి ఒక్క కుటుంబాన్ని నరకప్రాయంలోకి నెడుతున్నాయన్నారు. అంతేకాకుండా, ట్రంప్.. నెతన్యాహు ఆదేశాలను పాటిస్తున్నారని ఆరోపించారు. ఇరాన్ ప్రజల హక్కులను గౌరవించాలని, ఈ ప్రమాదకరమైన ఆటను ముగించాలని పిలుపునిచ్చారు.
-
యూఎస్ తో తలపడుతున్న ఇరాన్ బలాలేంటి? యుద్ధంలో ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? -
అమెరికా 'యుద్ధ విమానాలు' కాదు అట్ట పెట్టెలు.. మా 'రఫేల్' నయం..! -
మరో 48 గంటల్లో ప్రళయం.. ఇరాన్ ఖతం: ట్రంప్ ఫైనల్ వార్నింగ్ -
హార్మూజ్ తెరవండ్రా : ఇరాన్ పై బూతులతో రెచ్చిపోయిన ట్రంప్ -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం! -
ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ‘బాబ్ అల్ మాండెబ్’..? -
ఆ పైలట్ ట్రంప్ వద్ద కంటే ఇరాన్ లోనే సురక్షితం" -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
అమెరికాపై డ్రాగన్ దాడి.. ఇరాన్ చేతికి యుద్ధ వ్యూహాలు! -
యుద్ధ చరిత్రలో నిలిచిపోయే సాహసం! ఇరాన్ పర్వతాల్లో 'డెడ్లీ' ఆపరేషన్ -
Iran: ఆ పైలట్ కోసం ఓ విమానం, రెండు ఛాపర్లు పోగొట్టుకున్న అమెరికా? ఇరాన్ షాకింగ్..! -
అసమర్థ అమెరికా-ఇజ్రాయెల్ ?వీళ్ల వల్ల.. సాయిరెడ్డి సంచలన ట్వీట్..! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే













Click it and Unblock the Notifications