Iran-Israel War: ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకారం.. 10 నగరాలపై క్షిపణుల వర్షం
Iran-Israel War: ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న వివాదం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇజ్రాయెల్‌లోని పలు నగరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. అణుకేంద్రాలపై అమెరికా ప్రత్యక్ష దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత ఇరాన్ ఈ విధంగా స్పందించింది. ఇజ్రాయెల్ రాజధాన్ టెల్ అవీవ్, హైఫా వంటి నగరాలతో సహా 10 ఇజ్రాయెల్ నగరాలపై దాడి చేయడం ద్వారా ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ దాడులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా ధ్రువీకరించింది. ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోందని.. వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఐడీఎఫ్ పేర్కొంది. ఈ దాడులు చుట్టుపక్కల ప్రాంతాలలో భయాందోళనలకు కారణమయ్యాయి.
ఇజ్రాయెల్ గగనతలం మూసివేత
ఇజ్రాయెల్ మీడియా ప్రకారం.. ఇరాన్ తాజా క్షిపణి దాడులు ఇజ్రాయెల్‌లోని 10 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ వైమానిక దాడుల సమయంలో హెచ్చరిక సైరన్‌లు మోగడం ప్రారంభించాయి. ఇది పౌరులలో భయాందోళనలను రేకెత్తించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ తన గగనతలాన్ని మూసివేసింది. ఇరాన్ తమ దాడులను తీవ్రతరం చేసిన తర్వాత గగనతలాన్ని మూసివేసినట్లు ఇజ్రాయెల్ విమానాశ్రయ అథారిటీ ఓ ప్రకటన జారీ చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన పలు విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.

"భద్రతా పరిస్థితి కారణంగా దేశ గగనతలం మూసివేయబడింది" అని చెబుతూ ఇజ్రాయెల్ విమానాశ్రయ అథారిటీ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధాన విమానయాన సంస్థలు, ఎల్ అల్ ఇజ్రాయెల్ ఎయిర్‌లైన్స్, ఆర్కియా ఎయిర్‌లైన్స్ కూడా తదుపరి నోటీసు వచ్చేవరకు అన్ని రెస్క్యూ, రెగ్యులర్ విమానాలను నిలిపివేశాయి.ఈజిప్ట్, జోర్డాన్‌తో ల్యాండ్ క్రాసింగ్‌లు తెరిచి ఉంటాయి. పౌరులు, పర్యాటకులకు ప్రత్యామ్నాయ మార్గాలను అందిస్తాయి.
దాడిలో ప్రాణనష్టంపై సమాచారం లేదు
ఇజ్రాయెల్ జాతీయ అత్యవసర సేవ అయిన మాగెన్ డేవిడ్ అడోమ్ అనేక ప్రాంతాలలో నష్టం, గాయాలను నివేదించింది. అయితే ప్రాణనష్టంపైఖచ్చితమైన సంఖ్యపై ఇంకా సమాచారం లేదు. అదే సమయంలో ఇరాన్ దాడుల తర్వాత ప్రతీకారంగా ఐడీఎఫ్ పశ్చిమ ఇరాన్‌లోని అనేక సైనిక స్థావరాలపై దాడి చేసింది. ఈ ఉదయం ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరానియన్ సాయుధ దళాల సైనికులపై దాడి చేసి, ఇజ్రాయెల్ భూభాగం వైపు క్షిపణులను ప్రయోగించే లాంచర్లను వెంటనే నిలిపివేసిందని ఐడీఎఫ్ తెలిపింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి సమయంలో, ఇజ్రాయెల్ వైమానిక రక్షణ ఇంటర్‌సెప్టర్ పనిచేయక హైఫాలో కూలిపోయిందని, దీని కారణంగా ఉత్తర నగరంలో సైరన్‌లు మోగలేదని ఐడీఎఫ్ హోమ్ ఫ్రంట్ కమాండ్ అనుమానిస్తోంది.హైఫాలోని సెల్ ప్రసార వ్యవస్థ ద్వారా ముందస్తు హెచ్చరిక జారీ చేయబడింది, కానీ ఏ బాలిస్టిక్ క్షిపణి నగరం వైపు వెళ్లకపోవడంతో సైరన్ మోగలేదు.
ఇరాన్ రెండు రౌండ్లలో దాదాపు 27 క్షిపణులను ప్రయోగించిందని ఐడీఎఫ్ తెలిపింది. ఈ క్షిపణులలో ఒకటి టెల్ అవీవ్‌లోని నివాస ప్రాంతంపై పడింది. ఇందులో 13 మంది స్వల్పంగా గాయపడ్డారు. రెండో క్షిపణి నెస్ ట్జియోనా ఇళ్లపై పడింది. ఇందులో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. మధ్య ఇజ్రాయెల్‌లోని బిర్ యాకోవ్ సమీపంలోని రూట్ 431 హైవేపై ష్రాప్నెల్(పేలిన వస్తువుల నుంచి ఎగిరిపడే చిన్న చిన్న ముక్కలు) కారణంగా ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. గత వారం మాదిరిగానే ఈ ఉదయం దాడిలో ఇరాన్ క్లస్టర్ బాంబులను ఉపయోగించారా లేదా అనే దానిపై హోమ్ ఫ్రంట్ కమాండ్ కూడా దర్యాప్తు చేస్తోంది, కానీ ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు కనుగొనబడలేదు. జూన్ 13న ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్‌ను ప్రారంభించి ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా, ఇరాన్ ఇజ్రాయెల్‌లోని అనేక నగరాలపై దాడి చేసింది.












Click it and Unblock the Notifications