అమెరికాకు ఇరాన్ సంచలన వార్నింగ్.. మూల్యం చెల్లించుకోక తప్పదంటూ.. అమెరికా హై అలెర్ట్

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం తారాస్థాయికి చేరింది. గత 8 రోజులుగా ఇరు దేశాలు నువ్వా నేనా అంటూ భీకర స్థాయిలో దాడులకు పాల్పడుతున్నాయి. అయితే ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధంలోకి చొచ్చుకొచ్చిన అమెరికా.. ఇరాన్ లోని అణు స్థావరాలపై దాడులు చేసింది. అయితే అమెరికా తీరుపై ఇరాన్ మండిపడింది. ఈ మేరకు అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్.

గత 8 రోజులుగా ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర పోరు రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా ప్రవేశించింది. ఇరాన్ లోని అణు స్థావరాలపై దాడులు చేసింది. ఇరాన్ శాంతి చర్చలకు రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అయితే అమెరికా తీరుపై ఇరాన్ మండిపడింది. ఈ మేరకు అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా విదేశాంగ విధానానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని పేర్కొంది. యూఎస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కీలక వ్యాఖ్యలు చేసింది.

అమెరికా దాడుల నుంచి ఇరాన్ ప్రజలను.. సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ తెలిపారు. అమెరికా అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్య సమితి చార్టర్ లను ఉల్లంఘించి తమపై దాడులు చేసిందని అబ్బాస్ స్పష్టం చేశారు. అమెరికా శాశ్వత పరిణామాలను అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్ పై మరింత భారీ స్థాయిలో ప్రతి దాడులకు సిద్ధమవుతున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ తెలిపారు.

మరోవైపు ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధంలోకి అమెరికా రంగ ప్రవేశం చేయడంతో అమెరికా దాడులను పలు ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టేందుకు ఇరాన్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే జూన్ 23న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్.. రష్యాలో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశం జరిపి ప్రస్తుత పరిస్థితులను ఆయనకు వివరించనున్నారు.

Iran s FM Abbas Vows to Protect Sovereignty Slams US for Violating UN Charter

ఇదిలా ఉండగా ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్‌ తో టెలిఫోన్ లో సంభాషణ జరిపారు. ప్రస్తుత పరిస్థితులపై ఇరు దేశాధినేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేయాలని ప్రధాని మోదీ సూచనలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+