పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్..

అంతర్జాతీయ వేదికపై ఇరాన్-అమెరికా మధ్య రాయబారం నడిపి 'హీరో' అనిపించుకోవాలనుకున్న పాకిస్తాన్ ఆశలపై ఇరాన్ చన్నీళ్లు చల్లింది. ఒకవైపు చర్చలకు ఆతిథ్యం ఇస్తామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదనలు చేస్తుంటే, మరోవైపు పాకిస్తాన్‌కు వస్తున్న సరుకు రవాణా నౌకను ఇరాన్ దళాలు అడ్డుకొని వెనక్కి పంపడం గమనార్హం. ఈ పరిణామం దౌత్యపరంగా పాకిస్తాన్‌కు పెద్ద అవమానంగా భావిస్తున్నారు.

పంచ చమురు, గ్యాస్ సరఫరాలో ఐదో వంతు వాటా కలిగిన అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి' ఇప్పుడు ఇరాన్ కంచుకోటగా మారుతోంది. అంతర్జాతీయంగా స్వేచ్ఛా వాణిజ్య మార్గంగా గుర్తింపు పొందిన ఈ జలసంధిలో.. ఇకపై తన అనుమతి లేనిదే అడుగు పెట్టడం సాధ్యం కాదన్నట్లుగా ఇరాన్ వ్యవహరిస్తోంది. తాజాగా మార్చి 25న (బుధవారం) షార్జా నుంచి పాకిస్థాన్‌లోని కరాచీకి బయలుదేరిన 'సెలెన్' అనే కంటైనర్ నౌకను ఇరాన్ దళాలు అడ్డుకొని వెనక్కి పంపడం సంచలనంగా మారింది.

నౌకను వెనక్కి పంపిన IRGC.. కారణం ఇదే!

సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ జెండాతో ప్రయాణిస్తున్న 'సెలెన్' (IMO: 9208459) నౌకను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నిలిపివేసింది. ఈ చర్యపై రియర్ అడ్మిరల్ అలీరెజా తంగ్సిరి స్పందిస్తూ.. "చట్టపరమైన నిబంధనలను పాటించనందున, ముందస్తు అనుమతి లేనందున ఆ నౌకను వెనక్కి పంపాము. ఇకపై ఈ మార్గంలో ప్రయాణించే నౌకలు మా సముద్ర అధికారులతో ఖచ్చితంగా సమన్వయం చేసుకోవాలి" అని తేల్చి చెప్పారు. అంటే, అంతర్జాతీయ హామీ ఉన్న ఈ మార్గం ఇప్పుడు ఇరాన్ 'అనుమతి ఆధారిత కారిడార్‌'గా మారిపోయిందని స్పష్టమవుతోంది.

దౌత్య ప్రయత్నాలకు చుక్కెదురు!

ఈ ఉద్రిక్తతల మధ్యే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒక కీలక ప్రతిపాదన చేశారు. ఇరాన్-అమెరికా మధ్య చర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకున్నప్పటికీ, వాషింగ్టన్ తన అధికారిక భాగస్వామ్యాన్ని ఇంకా ధృవీకరించలేదు. మరోవైపు ఇరాన్ మాత్రం చర్చలకు తమకు ఆసక్తి లేదని, సంఘర్షణ కొనసాగిస్తామని మొండిగా సమాధానమివ్వడం గమనార్హం.

ప్రపంచంపై ప్రభావం..

సొంత పోర్టు (కరాచీ)కు వెళ్లే నౌకనే ఇరాన్ అడ్డుకోవడం పాకిస్థాన్ దౌత్య ప్రయత్నాలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ పరిణామం వల్ల ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడనుంది. హార్ముజ్ జలసంధిలో నియంత్రణ పెరగడం వల్ల ఓడల ప్రయాణ కాలం పెరగడమే కాకుండా, సరుకు రవాణా ఖర్చులు (Freight Charges) అమాంతం పెరిగే అవకాశం ఉంది. ఇది అంతర్జాతీయంగా నిత్యావసరాలు, ఇంధన ధరల పెరుగుదలకు దారితీస్తుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+