అమెరికా యుద్ధ విమానాల్లో నుంచి దూకేసిన పైలట్లు-పట్టిస్తే ఇరాన్ భారీ బౌంటీ..!
ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్దం రెండో నెలకు చేరుకున్నా ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేని పరిస్ధితి. మరోవైపు ఈ యుద్దంలో అమెరికా నష్టాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా సౌదీ అరేబియాలో ఖరీదైన రాడార్ ను ఇరాన్ ధ్వంసం చేసింది. ఇది జరిగిన సమయంలో రెండు అమెరికా యుద్ధ విమానాలను కూడా ఇరాన్ కూల్చేసింది. అయితే వీటిని నడుపుతున్న పైలట్లు మాత్రం వాటిలో నుంచి దూకేశారు. ఈ ఘటన ఇరాన్ భూభాగంలోనే చోటు చేసుకుంది. దీంతో వీరిని పట్టిస్తే బహుమతి ఇస్తామని ఇరాన్ ప్రకటించింది.
ఇవాళ నైరుతి ఇరాన్‌లో ఒక అమెరికన్ యుద్ధ విమాన పైలట్ విమానం నుండి బయటకు దూకినట్లు, ఇరాన్ మీడియాను ఉటంకిస్తూ ఏపీ వార్తా సంస్థ నివేదించింది. అనంతరం మీరు శత్రు పైలట్‌ను లేదా పైలట్‌లను పట్టుకుని, వారిని సజీవంగా పోలీసులకు లేదా సైనిక దళాలకు అప్పగిస్తే, మీకు విలువైన బహుమతి లభిస్తుందంటూ ఇరాన్ అధికారిక మీడియాలో ఓ ప్రకటన వచ్చింది. స్క్రీన్‌పై మరో టెక్స్ట్ సందేశంలో "వారు కనిపిస్తే కాల్చివేయండి" అని ప్రజలను కోరింది. పైలట్లను పట్టించిన వారికి 60 వేల డాలర్ల బౌంటీ ఇవ్వనున్నారు.

అనంతరం ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఐఆర్‌ఐబి.. సామాన్య పౌరులు ప్రైవేట్ కార్లలో ప్రమాద స్థలం వైపు వెళ్లినట్లు ఎక్స్ లో పోస్ట్ చేసింది. నైరుతి ఇరాన్‌లో చాలా మంది ప్రజలు అమెరికన్ పైలట్‌ను పట్టుకోవడానికి ప్రైవేట్ కార్లలో అమెరికన్ యుద్ధ విమానం కూలిన ప్రదేశం చుట్టూ ఉన్న ప్రాంతానికి వెళ్లారు. పైలట్‌ను ఎవరూ హింసించకుండా చూడాలని ఇరాన్ సాయుధ దళాలు ప్రజలకు పిలుపునిచ్చాయని తెలిపింది.

మరోవైపు మధ్య ఇరాన్‌పై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒక ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానాన్ని కూల్చివేసిందని ఇరాన్ మీడియా పేర్కొంది. ఇరాన్‌కు చెందిన తస్నిమ్ వార్తా సంస్థ, ఒక అమెరికన్ జెట్ విమాన శకలాల ఫొటోల్ని ప్రచురించింది. పైలట్ ప్రాణాలతో బయటపడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కూడా అది పేర్కొంది.యూకేలోని ఆర్‌ఏఎఫ్ లేకెన్‌హీత్‌లో ఉన్న 494వ ఫైటర్ స్క్వాడ్రన్‌కు చెందిన ఒక ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ విమానాన్ని కూల్చివేశారని ఐఆర్‌ఐబి మరో ప్రకటన చేసింది. తోక రెక్క శకలాలు కూల్చివేతను ధృవీకరిస్తున్నాయని, పైలట్ల స్టేటస్ తెలియదని పేర్కొంది.












Click it and Unblock the Notifications