అమెరికాపై ఇరాన్ బాంబుల వర్షం.. వార్ రూమ్ లోకి ట్రంప్.. మూడో ప్రపంచ యుద్ధం షురూ..!
ఇరాన్ అన్నంత పనీ చేసింది. ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధంలో జోక్యం చేసుకోవడమే కాకుండా ఇరాన్ లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది అమెరికా. ఈ దాడులపై అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొంది. తాజాగా ఇరాన్ అన్నంత పనీ చేసింది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది.
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు తారా స్థాయికి చేరిన నేపథ్యంలో అమెరికా వచ్చి ఇరు దేశాల మధ్య అగ్నికి ఆజ్యం పోసింది. ఇరాన్ లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. దీంతో తాజాగా పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేపట్టింది. మొదట సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. అక్కడ అగ్రరాజ్యానికి చెందిన మూడు సైనిక స్థావరాలను నేలమట్టం చేసింది ఇరాన్.

తాజాగా ఖతార్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. అత్యంత శక్తివంతమైన క్షిపణులతో అమెరికా స్థావరాలపై విరుచుకుపడింది. అయితే ఖతార్ తో పాటు ఇరాక్, బహ్రెయిన్, కువైట్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ క్రమంలో పశ్చిమాసియా నుంచి అమెరికా సైన్యాన్ని పూర్తిగా ఎలిమినేట్ చేసేందుకు ఇరాన్ యత్నిస్తోందని తెలుస్తోంది. 'ఆపరేషన్ బేషారత్ ఫతా' అని ఇరాన్ దాడులకు పేరు పెట్టింది.
🚨VIDEO FROM DOHA, QATAR #Iran #USA #Qatar pic.twitter.com/8SHJXffmbf
— RAJAT (@IRajatJain) June 23, 2025
ఖతార్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఆరు మిసైల్స్ తో ఇరాన్ విరుచుకుపడినట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ప్రస్తుతం వార్ రూమ్ నుంచి ఇరాన్ దాడుల వివరాలను తెలుసుకుంటున్నారు. మరోవైపు తమపై ఎన్ని బాంబులు కురిపించిందో అంతే స్థాయిలో అమెరికా సైనిక స్థావరాలపై బాంబులు వేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
🇮🇷🇺🇸Iran responded to Trump by launching missile attacks on US military bases in Iraq, Kuwait, Qatar, and Bahrain. #WWIII Irak pic.twitter.com/dZ2THXs0HI
— Lady (@A_Nashenas1) June 23, 2025
మరోవైపు ఖాతార్ లోని భారత పౌరులకు ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. దాడుల వేళ ఎవరూ బయటకు రావొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచనలు చేసింది.












Click it and Unblock the Notifications