US Refueling Aircraft Crash: ఇరాన్ వార్ లో అమెరికాకు అతిపెద్ద షాక్..!

ఇరాన్ పై ఏకపక్షంగా యుద్దం మొదలుపెట్టిన అమెరికా-ఇజ్రాయెల్ కు వరుస ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ఇరాన్ ను తక్కువ అంచనా వేసి యుద్ధ విమానాలతో విరుచుకుపడవచ్చని భావించిన అమెరికాకు ఇవాళ మరో అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే కువైట్ లో మూడు చమురు నింపే యుద్ధ విమానాలు కుప్పకూలడంతో ఆత్మరక్షణలో పడ్డ అమెరికాకు ఇవాళ ఇరాక్ లో మరో చమురు నింపే యుద్ధ విమానం (US Refueling Aircraft)కూలిపోవడం పెద్ద షాక్ ఇచ్చింది.

ఇరాన్‌పై ఆపరేషన్‌లో పాల్గొంటున్న ఒక అమెరికన్ మిలిటరీ ఇంధనం నింపే విమానం ఇరాక్‌లో కూలిపోయిందని యూఎస్ ప్రభుత్వం తెలిపింది. ఫిబ్రవరి 28న మధ్యప్రాచ్య వివాదం ప్రారంభమైనప్పటి నుండి ఇలా అమెరికా యుద్ద విమానం కూలిపోవడం ఇది నాలుగోసారి. ఇప్పటికే కువైట్ లో మూడు యుద్ధ విమానాలు కూలిపోగా.. ఇది నాలుగో ఘటన. కూలిపోయిన KC-135 యుద్ధ విమానంలో కనీసం ఐదుగురు సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు.

US Refueling Aircraft

మధ్యప్రాచ్యాన్ని పర్యవేక్షించే అమెరికా సెంట్రల్ కమాండ్ అందించిన వివరాల మేరకు రెండు విమానాలు ఇరాక్ పై ఎగురుతుండగా.. ఇందులో చమురు నింపే కేసీ 135 కూలిపోయింది. మరొకటి సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని తెలిపింది. ఇరాన్‌పై అమెరికా మిలిటరీ కార్యకలాపాలలో భాగంగా కూలిపోయిన నాలుగో విమానం కావడంతో ట్రంప్ సర్కార్ విమర్శలు ఎదుర్కోక తప్పడం లేదు. గత వారం స్నేహపూర్వక కువైట్ కాల్పుల ద్వారా మూడు అమెరికన్ ఫైటర్ జెట్‌లను పొరపాటున కూల్చివేసినట్లు అమెరికా ప్రకటించింది. వాటిలో పైలట్లు సురక్షితంగా తప్పించుకున్నారు. కానీ ఈసారి మాత్రం పైలట్ల సహా ఐదుగురు సిబ్బంది చనిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+