అమెరికా సైన్యాన్ని హార్మూజ్ సుడిగుండాల్లో కప్పెట్టేస్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్
ఇరాన్ తో చర్చలు విఫలమైన నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని దిగ్బంధనం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ కు తాజాగా ఇరాన్ ఘాటుగా బదులిచ్చింది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆదివారం ప్రకటించింది. శత్రువులు ఎలాంటి తప్పు చేసినా ప్రమాదకర పరిణామాలు తప్పవని హెచ్చరించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ జలసంధిని దిగ్బంధించాలని అమెరికా నేవీకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇరాన్ ఈ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఇరాన్ దళాలు అన్ని సముద్రయాన కదలికలను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నాయి. గార్డ్స్ నావికా కమాండ్ ఎక్స్ లో పర్షియన్ భాషలో పోస్ట్ చేస్తూ.. "ఈ మార్గంలోని ట్రాఫిక్ అంతా సాయుధ దళాల పూర్తి నియంత్రణలో ఉంది" అని స్పష్టం చేసింది. అంతేకాదు.. "శత్రువు తప్పుడు అడుగు వేస్తే.. జలసంధిలోని ప్రాణాంతక సుడిగుండంలో చిక్కుకోవడం ఖాయం" అని కూడా హెచ్చరించింది.
ఈ బలమైన హెచ్చరికలతో పాటు, క్రాస్ హెయిర్‌లలో ఉన్న నౌకలను చూపిస్తున్న ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది ఇరాన్. తాజా పరిణామాలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింతగా పెంచాయి. అంతకుముందు ఇరాన్ తో యుద్ధం ముగించేందుకు అమెరికా చేసిన చర్చలు విఫలమైన సందర్భంగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని హెచ్చరికలు జారీచేశారు. ఈ జలమార్గంలోకి ప్రవేశించడానికి లేదా నిష్క్రమించడానికి ప్రయత్నం చేసే అన్ని నౌకలను అమెరికా నేవీ తక్షణమే దిగ్బంధించడం ప్రారంభిస్తుందని ట్రంప్ హెచ్చరించారు. అయితే ట్రంప్ వార్నింగ్ పై తాజాగా ఇరాన్ ఘాటుగా బదులిచ్చింది.

ఇక పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. దాంతో అమెరికా, ఇరాన్ బృందాలు అక్కడినుంచి వెళ్లిపోయాయి. చర్చలు విఫలమైన విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు. ఇస్లామాబాద్ వేదికగా దాదాపు 21 గంటలకు పైగా జరిగిన చర్చలు విఫలం అయ్యాయని పేర్కొన్నారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికా పెట్టిన డిమాండ్స్ కారణంగానే చర్చలు విఫలమయ్యాయని చెబుతోంది.
-
యుద్ధంలోకి అమెరికా నేవీ.. హార్మూజ్ జలసంధి అష్టదిగ్బంధనం.. ట్రంప్ సంచలన వార్నింగ్ -
కిలో బియ్యం రూ.600 - రూ.800.. కేజీ మాంసం రూ. 4000 పైనే !!! -
మన బంగారం మన దేశానికే! ఫ్రాన్స్ మాస్టర్ ప్లాన్ -
ఇజ్రాయెల్ కావాలా ? చర్చలు కావాలా ? 'ట్రంప్ కు ఇరాన్ అల్టిమేటం..! -
US-Iran Talks: అమెరికాతో చర్చల్లో ఇరాన్ కు తొలి విజయం..! బంపర్ ఆఫర్..! -
అమెరికాకు అనూహ్య షాక్..! చర్చల కోసం ఇరాన్ 4 షరతులు..! -
Hormuz: హార్ముజ్ లో సీమైన్స్ కనిపెట్టలేం..! చర్చల వేళ బాంబుపేల్చిన ఇరాన్..! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి.. -
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
అమెరికా ప్రయోగించిన అందమైన అస్త్రం: ఒక్క మీటింగ్‌తో గ్లోబల్ స్టార్‌గా..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న!










Click it and Unblock the Notifications