నాడు వైఎస్సార్..నేడు ఇరాన్ ప్రెసిడెంట్: పొట్టన బెట్టుకున్న ఆ హెలికాప్టర్

Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా సయ్యద్ ఇబ్రహీం రైసీ అల్- సదటి కన్నుమూశారు. హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఇబ్రహీ రైసీతో పాటు మరో తొమ్మిది మంది ఈ దుర్ఘటనలో దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఉన్నారు.

వాళ్లు ప్రయాణిస్తోన్న బెల్ 212 రకానికి చెందిన హెలికాప్టర్ పెను ప్రమాదానికి గురైంది. ఇరాన్- అజర్‌బైజాన్ సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన ఓ డ్యామ్ ప్రారంభోత్సంలో పాల్గొని తిరిగి వచ్చే సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇబ్రహీం రైసీ.

Iranian President Ebrahim Raisi died in helicopter crash

డ్యామ్ ప్రారంభోత్సవం ముగిసిన తరువాత హెలికాప్టర్‌లో రాజధాని టెహ్రాన్‌కు తిరుగుముఖం పట్టారు. ఈస్ట్ అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని వర్జాఖాన్- జోల్ఫా మధ్య విస్తరించి ఉన్న దట్టమైన డిజ్మర్ అడవుల మీదుగా హెలికాప్టర్ ప్రయాణిస్తోన్న సమయంలో అది కుప్పకూలింది. దట్టమైన పొగమంచు వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు ఇరాన్ హోం మంత్రి అహ్మద్ వహీదీ తెలిపారు. పొగమంచు, ప్రతికూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పైలెట్.. హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు.

ఇరాన్-అజర్‌బైజాన్ సరిహద్దుల్లో విసర్తించి ఉన్న డిజ్మర్ అడవుల మధ్య ప్రమాదం సంభవించడం వల్ల సహాయక, భద్రత సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకోలేకపోతున్నారు. హెలికాప్టర్ ప్రమాదానికి గురైన స్థలాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. ఫలితంగా సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం నెలకొంది.

సంఘటన స్థలానికి చేరుకోవడానికి సహాయక సిబ్బందికి సుమారు 20 గంటల సమయం పట్టింది. హెలికాప్టర్ శకలాలను గుర్తించడానికి టర్కీ వినియోగించిన డ్రోన్లు సంఘటన స్థలాన్ని గుర్తించాయి. దాని జాడ తెలిసిన తరువాత సహాయక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు.

హెలికాప్టర పూర్తిగా ధ్వంసమైంది. ముక్కచెక్కలైంది. మృతుల శరీర భాగాలను గుర్తించడం సైతం కష్టతరమైంది. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో జీవించి లేరని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. మొత్తం తొమ్మిదిమంది దుర్మరణం పాలైనట్లు నిర్ధారించింది.

ఇబ్రహీ రైసీతో పాటు విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ హొస్సైన్ అమిరబ్దుల్లాహియాన్, అయతొల్లా సయ్యద్ ముహమ్మద్ అలీ అల్-హషెమ్, డాక్టర్ మాలిక్ రహ్మతి, సర్దార్ సయ్యద్ మెహదీ మౌసవి, అన్ అనసర్ అల్-మెహదీ కార్ప్స్, పైలెట్, కో పైలెట్, కృఛేవ్ అనే వ్యక్తి మరణించారు.

ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ దుర్ఘటన ఉదంతం మొత్తం కూడా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాదాన్ని గుర్తు చేసింది. వైఎస్సార్ సైతం బెల్ రకానికి చెందిన హెలికాప్టర్‌ను వినియోగించారు. నాడు వైఎస్సార్‌, నేడు ఇబ్రహీం రైసీని పొట్టనబెట్టుకుంది బెల్ 212 హెలికాప్టర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+