ఐఎస్ఐఎస్: సద్దాంకు ఉరిశిక్ష తీర్పు చెప్పిన జడ్జి హత్య

బగ్దాద్: ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్‌కు 2006లో ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన న్యాయమూర్తిని ఇస్లామ్ మతఛాందస సంస్థ ఐఎస్ఐఎస్ పట్టుకుని చంపింది. ఈ మేరకు పలు అరబ్ మీడియాలో వార్తలు వచ్చాయి.

మీడియా కథనాల ప్రకారం - కుర్దిష్ న్యాయమూర్తి రౌఫ్ రహ్మాన్‌ను సున్నీ మిలిటెంట్లు సద్దాం ఉరికి ప్రతీకారంగా చంపేశారు. న్యాయమూర్తిని మిలిటెంట్లు జూన్ 16వ తేదీన పట్టుకున్నట్లు సమాచారం. న్యాయమూర్తిని చంపిన విషయాన్ని ఇరాక్ ప్రభుత్వం ధ్రువీకరించలేదు. కానీ, అతి ముఖ్యమైన రెండు ఫేస్‌బుక్ పోస్టులు ఈ విషయాన్ని చెబుతున్నాయి.

Iraq crisis: ISIS kill judge who ordered Saddam Hussein's hanging

2006లో సద్దాం హుస్సేన్‌పై విచారణ జరిపిన సుప్రీం ఇరాకీ క్రిమినల్ ట్రిబ్యునల్‌కు నేతృత్వం వహించిన రహ్మాన్‌ను పట్టుకుని చంపినట్లు జోర్డాన్ ఎంపి ఖలీల్ అతీక్ ఫేస్‌బుక్‌లో రాశారు. డ్యాన్సర్స్ డ్రెస్‌లో పారిపోవడానికి జడ్జి ప్రయత్నించారని, అయితే ఐఎస్ఐఎస్ ఫైటర్స్ పట్టుకున్నారని ఆయన రాశారు.

సద్దాం డిప్యూటీగా వ్యవహరించి, ప్రస్తుతం సున్నీ మిలిటెంట్లలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఇజ్జత్ ఇబ్రహీం ఆల్ దౌరీ కూడా ఆ విషయాన్ని ధ్రువీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+