వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా, బ్రిటన్ విలవిల.. లక్ష‌ల్లో బాధితులు.. 73 శాతం పెరిగిన ఒమిక్రాన్ కేసులు

|
Google Oneindia TeluguNews

ప్రపంచాన్ని ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ మహమ్మారి వెంటాడుతోంది. రోజుకు రోజుకు వైరస్ వ్యాప్తి విస్తరిస్తోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరగడంతో ప్రపంచ దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దాదాపు సగం కేసులు, మ‌ర‌ణాలు అమెరికా , బ్రిటన్‌లోనే నమోదువుతున్నాయి. ఆ దేశాల్లో ఆస్పత్రుల బెడ్లన్నీ నిండిపోయాయి. రోజుకు ల‌క్షల సంఖ్య‌లో కేసులు రావ‌డంతో రానున్న రోజుల‌లో ఎలాంటి ప‌రిస్థితు త‌లెత్తుతాయో అన్న ఆందోళ‌న నెల‌కొంది.

 అమెరికాలో రోజుకు ల‌క్ష‌ల సంఖ్య‌లో కేసులు

అమెరికాలో రోజుకు ల‌క్ష‌ల సంఖ్య‌లో కేసులు

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. మరోవైపు ఒమిక్రాన్ విజృంభిస్తోంది. దీంతో రోజుకు రెండు లక్ష‌లకుపైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా 2,65,032 మంది కరోనా బారిన పడ్డారు. అమెరికాలో కరోనా డెల్టా వేరియంట్ బాధితుల సంఖ్య 27 శాతానికి త‌గ్గింది. కానీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారినపడే వారి సంఖ్య 73శాతానికి పెరిగిందని సీడీపీ తెలిపింది. ఈ ఏడాది జనవరి, సెప్టెంబర్ తర్వాత అత్యధిక కేసులు ఇప్పుడు న‌మోదు అవుతున్నాయి. అమెరికాలో ఇప్పటివరకు 5 కోట్ల మందికి కరోనా బారినపడ్డారు. 8 లక్ష‌ల మంది మరణించారు.

బ్రిట‌న్‌లో ఒమిక్రాన్ విజృంభ‌ణ‌

బ్రిట‌న్‌లో ఒమిక్రాన్ విజృంభ‌ణ‌

అటు బ్రిటన్ కూడా కరోనా, ఒమిక్రాన్ ధాటికి గజగజవణికిపోతోంది. రోజుకు లఓకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విదంగా మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. తాజాగా 1,19,789 మందికి వైరస్ బారిన పడ్డారు. ఇప్పటివరకు యూకేలో 1,47,720 మంది మఈతి చెందారు. మరోవైపు స్పెయిన్ , ఇటలీ, కెనడా, ఫ్రాన్స్ దేశాల్లోనూ ఈ వైరస్ దాటికి విలవిలలాడుతున్నాయి. ప్రతి రోజు భారీగానే కేసులు నమోదు అవుతున్నాయి.

 3.డెల్మిక్రాన్ పంజానే కారణమా?

3.డెల్మిక్రాన్ పంజానే కారణమా?

అయితే ఈదేశాల్లో ఒక్కసారిగా కేసులు పెరగడానికి కారణం లేకపోలేదని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వేవ్ వెనుక డెల్మిక్రాన్ ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్‌ను కలిపి డెల్మిక్రాన్ గా పిలుస్తారు. ఒకే సమయంలో ఒక వ్యక్తికి కరోనా డెల్టాతో పాటు ఒమిక్రాన్ కూడా సోకితే డెల్మిక్రాన్ గా పరిగణినించాల్సి ఉంటుందని నిపుణులు అబిప్రాయపడుతున్నారు. అదే విధంగా డెల్టా నుంచి కోలుకున్న ఒక వ్యక్తికి ఒమిక్రాన్ సోకితే డెల్మిక్రాన్ ఇన్పెఓన్ గా పేర్కొంటున్నారు.

 లక్షణాలు ఏమిటి ?

లక్షణాలు ఏమిటి ?


కరోనా డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ బారినపడిన వ్యక్తుల్లో సాధారంగా ఒకే రకమైన లక్ష‌ణాలు కన్పిస్తున్నాయి. జలుబు, జ్వరం, దగ్గు , తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటివి బయటపడుతున్నాయి. అయితే డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్‌తో తీవ్రత తక్కువేన‌ని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలు కూడా తక్కువగానే ఉన్నాయి. కానీ ఈ డబుల్ ఇన్పెక్ష‌న్ వల్ల వృద్ధులు, రోగనిరోధక శక్తి త‌క్కువ ఉన్న‌వారికి , ఇతర అనారోగ్యాలతో బాధపడేవారికి ఈ ముప్పు ఎక్కువగా ఉండే ప్రమాదం పొంచి ఉందని హెచ్చిరిస్తున్నారు నిపుణులు. ఈ వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి ప్ర‌తి ఒక్క‌రు మాస్కులు, బౌతిక దూరం పాటించాల‌ని సూచిస్తున్నారు.

English summary
Corona, Omicron Spread in US,UK .. millions in victims .. 73% increase in omicron cases
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X