ప్రమాదంలో భారత్-యూఎస్ బంధం?.. అమెరికన్ సెనేటర్ల వార్నింగ్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భారత్‌పై ట్రంప్ విధించిన సుంకాలను ఇప్పుడు స్వదేశంలోనే వ్యతిరేకిస్తున్నారు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన సీనియర్ సెనేటర్ గ్రెగరీ మీక్స్ ట్రంప్ నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు. అమెరికా-భారత్‌ల మధ్య దశాబ్దాల కాలంగా కష్టపడి నిర్మించుకున్న బంధాన్ని ట్రంప్ ప్రమాదంలో పడేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య ఏదైనా సమస్య ఉంటే దాన్ని ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా, పరస్పర గౌరవంతో పరిష్కరించుకోవాలని మీక్స్ సూచించారు.
ట్రంప్ సర్కారు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై ముందుగా 25 శాతం సుంకం విధించింది. ఆ తర్వాత బుధవారం అర్ధరాత్రి మరో 25 శాతం అదనపు సుంకం విధించి, మొత్తం సుంకాన్ని 50 శాతానికి పెంచింది. ఇది భారత్‌కు, అమెరికాకు మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సుంకాల వ్యవహారంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ట్రంప్ బెదిరింపులకు తలవంచబోమని, దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. భారత్ తన రైతులకు, ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగా ఉండే విధానాలను కొనసాగిస్తుందని ఆయన తెలిపారు.

డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధానంలో ఉన్న ద్వంద్వ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్యా నుంచి భారత్ కంటే ఎక్కువ చమురు దిగుమతి చేసుకుంటున్న చైనాకు ట్రంప్ 3 నెలల సమయం ఇచ్చారు. అదనపు సుంకాలు విధించలేదు. కానీ భారత్‌కు మాత్రం కేవలం 3 వారాల సమయం ఇచ్చి.. ఆ వెంటనే సుంకాన్ని రెట్టింపు చేశారు. ఇది ట్రంప్ భారత్‌ను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారని స్పష్టం చేస్తోంది. ఈ పరిస్థితిలో భారత ప్రభుత్వం అమెరికాకు గట్టిగా బదులిచ్చింది. క్రెమ్లిన్ కూడా భారత్‌కు మద్దతుగా మాట్లాడి ట్రంప్‌ను షాక్‌కు గురిచేసింది.












Click it and Unblock the Notifications