ఐస్ఐస్ మరో ఘాతుకం: ఈసారి కుర్ధు యోధుల పీకలు కోశారు (ఫోటో)
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు తాజాగా ముగ్గురు కుర్ధు యోధుల పీకలను తెగ్గోసిన వీడియోను ఇంటర్నెట్‌లో ఉంచారు. ఈ వీడియో నిడివి 6 నిమిషాలు ఉంది. ఉత్తర ఇరాక్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది.
తమ వద్ద ఇంకా 17 మంది బందీలుగా ఉన్నారని, వారికి ఇదే గతి పడుతుందని వీడియోలో ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు హెచ్చరించారు. ఇక వీడియో విషయానికి వస్తే "కుర్దు ప్రజలారా మా యుద్ధం మీపై కాదని తెలుసుకోండి. ముస్లింలపై యుద్ధాన్ని బలంవంతంగా రుద్దుతున్నవారిపైనే మా పోరాటం" అని వీడియోలో కనిపించిన ఓ మిలిటెంట్ తెలిపాడు.
🔞 #ISIS released a video of 3 #Kurdish #Peshmerga beheading pic.twitter.com/sWjbmFD5cn
— Mete Sohtaoğlu (@metesohtaoglu) March 20, 2015 మరో మిలిటెంట్ కుర్ధు సాయుధ బలగాల నేత మసూద్ బర్జానీని ఉద్దేశించి మాట్లాడుతూ "గతంలోనే నిన్ను హెచ్చరించాం. ఐఎస్ఐఎస్ రక్షణలో ఉన్న వారిపై దాడులు చేస్తే, మా వద్ద బందీలుగా ఉన్న మీ వాళ్లలో ఒకరిని నీ స్వహస్తాలతో నువ్వే చంపుకున్నట్టవుతుంది" అని తెలిపాడు.

కుర్దు ప్రజలు శనివారం తమ యొక్క నూతన సంవత్సరమైన న్యూరోజ్‌ను జరుపుకోనున్న తరుణంలో ఈ వీడియో విడుదల కలకలం సృష్టిస్తోంది. ఈ వీడియో విడుదల అనంతరం కుర్దు దేశ మాజీ ప్రధాని బర్హాం మాట్లాడుతూ శనివారం జరుపుకోనున్న నూతన సంవత్సర వేడుకలను 'న్యూరోజ్ ధిక్కరణ'గా అభివర్ణించారు.












Click it and Unblock the Notifications