ఐఎస్ క్రూరం: సెక్స్‌కు ఒప్పుకోలేదని 19 మంది దగ్ధం

మోసోల్ : ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ మరో క్రూరమైన చర్యకు పాల్పడింది. లైంగిక కోరిక తీర్చని 19 మంది బాలికలను దారుణంగా చంపేసింది. ఇరాక్‌లోని ఐఎస్ ఆధీనంలోని మోసోల్‌లో ఈ ఘటన జరిగింది. తమను సుఖపెట్టని బాలికలను ఉగ్రవాదులు ఇనుప జాలీలో బంధించారు.

అందరూ చూస్తుండగా నిప్పంటించి వారిని సజీవ దహనం చేశారు. భయంతో ఏ ఒక్కరు కూడా వారిని కాపాడలేకపోయినట్లు కుర్దీష్‌కు చెందిన వార్తా సంస్థ తెలిపింది. వందలాది మంది చూస్తుండగానే ఆ దారుణానికి పాల్పడ్డారని, వారిని రక్షించేందుకు ఎవరూ ముందుకు వచ్చే సాహసం చేయలేదని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.

Isis burns 19 Yazidi women to death in Mosul for 'refusing to have sex with fighters'

ఇరాక్‌లోని యాజ్దీ ప్రాంతాన్ని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు 2014లో ఆక్రమించుకున్నారు. అప్పటి నుంచి అక్కడి ప్రజల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. సెక్స్ బానిసలుగా మారడానికి అంగీకరించని యాజ్జీ యువతులను గతంలో కూడా దారుణంగా కొట్టి చంపారు.

క్రైస్తవం, జోరాస్ట్రియన్, ఇస్లాం మతాలను ఆచరించే యాజ్జీ జాతి ప్రజలను ఐఎస్ఐఎ్ సైతాను ఆరాధకులుగా ముద్రవేస్తూ వారిపై పైశాచిక చర్యలకు పాల్పడుతోంది. వారి ఆగడాలకు భయపడి దాదాపు యాభై వేల మంది యాజ్డీలు దేశం విడిచి పారిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+