వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాద సామ్రాజ్యం కోసం ఐఎస్ఐఎస్ యత్నం

|
Google Oneindia TeluguNews

లండన్: సిరియా, ఇరాక్ దేశాల్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకుని సొంతంగా ఉగ్రవాద సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ప్లాన్ వేసిందనే రహస్యం బయటపడింది. ఐఎస్ఐఎస్ రెండు దేశాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించిందని వెలుగు చూసింది.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రణాళికలు రచించుకున్నట్లు ఆధారాలు బయటపడ్డాయని, దీనికి సంబంధించిన 24 పేజీలతో కూడిన వ్యవహార పత్రాలు లీకయ్యాయని లండన్ లోని గార్డియన్ అనే దిన పత్రిక ప్రచురించింది.

అంతే కాకుండ సిరియా, ఇరాక్ దేశాల్లోని అన్ని ప్రభుత్వ శాఖలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కుట్రపన్నారని ఆ పత్రిక పేర్కోనింది. బయటపడిన ఈ ప్రతాలకు ముందుగానే ఇస్లామిక్ స్టేట్ పరిపాలన నిబంధనలు అనే పేరు పెట్టారని వెలుగు చూసింది.

ISIS militant group in building a state in Iraq and Syria

ఈజిప్టుకు చెందిన అబు అబ్దుల్లా అల్ మస్రీ అనే వ్యక్తి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పరిపాలన కోసం 10 చాప్టర్లు వ్రాశాడు. 2014 జూన్-ఆక్టోబర్ మధ్య కాలంలో దీనిని రాసినట్లు ఉందని ఆ దిన పత్రిక వివరించింది.

ఇరాక్, సిరియా దేశాలలో విద్య ఎలా ఉండాలి, పరిశ్రమలు ఎలా స్థాపించాలి, సహజ వనరులు ఎలా ఉపయోగించుకోవాలి, దౌత్యం, మతపరమైన ప్రచారం ఎలా చెయ్యాలి, మిలటరిని ఎలా ఉపయోగించుకోవాలి అంటూ అందులో క్షుణ్ణంగా వ్రాశారని వెలుగు చూసింది.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు క్షేత్ర స్థాయిలో అన్నీ పరిశీలించిన తరువాత ఒక్కోక్కటిగా దాడి చేస్తూ రెండు దేశాలను ఆక్రమించుకుంటూ వస్తున్నదని స్పష్టంగా వెలుగు చూసిందని గార్డియన్ పత్రిక వివరించింది. ఇస్లామిక్ స్టేట్ దగ్గర పక్కా వ్యూహం ఉందని ఈ ఆదారాలు చెబుతున్నాయని తెలిపింది.

English summary
A leaked dossier of ISIS terror group published on Monday in a leading newspaper (London) show the sophisticated plans of the militant group in building a state in Iraq and Syria complete with government departments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X