ఐసిస్ క్రూరత్వం: ఇరాక్‌లో 45మందిని పెట్రోల్ పోసి తగలబెట్టారు
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మానవత్వం లేకుండా కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇరాక్‌లో 45 మందిని సజీవ దహనం చేశారు. వారిని బంధించి పెట్రోలు పోసి నిప్పు అంటించారని సమాచారం. ఈ ఘటన పశ్చిమ ఇరాక్‌లోని అల్ బాగ్దాది పట్టణం సమీపంలో జరిగిందని సమాచారం.
ఈ ఘటన జరిగినట్లుగా బీబీసీ తెలిపిందని పోలీసులు తెలిపారు. వీరిలో కొందరు సైనికులు కూడా ఉన్నారని సమాచారం. ఈ సంఘటన మంగళవారం జరిగింది. ఈ సంఘటన ప్రాంతం అమెరికా మెరైన్స్ నిలిచి ఉన్న ఐదు కిలోమీటర్ల దూరంలో జరిగింది.
బాధితులు ఎవరో తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే అందులో కొందరు సెక్యూరిటీ ఫోర్స్ ఉండవచ్చునని భావిస్తున్నారు. కాగా, ఐసిస్ తీవ్రవాదులు గత కొద్దిరోజులుగా పలు పట్టణాలను తమ చేతుల్లోకి తీసుకున్నారు.

కాగా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి తమ క్రూరత్వంతో రెచ్చిపోయారు. ఈజిప్ట్‌కు చెందిన 21 మంది కాప్టిక్ క్రిస్టియన్స్‌ను లిబియాలోని ట్రిపోలీ సమీపంలో గల సమద్ర తీరంలో తలలు తెగ్గోసి చంపిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించిన వీడియోని ఇంటర్నెట్లో విడుదల చేశారు.
ఇస్లామికి స్టేట్స్ కాక సరిహద్దు దేశమైన ఈజిప్ట్ వచ్చి ఉగ్రవాదులు ఈ దారుణానికి తెగబడటం ఆ ప్రాంతంలో వారి ప్రాబల్యం మరింతగా పెరుగుతోంది అనడానికి సంకేతాలని, దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ఈజిప్టులోని మానవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అత్యంత భయంకరంగా ఉన్న ఈ వీడియోని చూసిన వారంతా ఐసీస్ ఉగ్రవాదులు దుశ్శర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు.












Click it and Unblock the Notifications