వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసిస్ కొత్త టార్గెట్: బ్రిటిష్ రాణి పాల్గొనే సభలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

లండన్: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మిలిటెంట్ గ్రూపుకు చెందిన మిలిటెంట్లు ఈ వారంలో బ్రిటన్‌లో దాడులకు పాల్పడుతున్నారంటూ వచ్చిన వార్తా కథనాలు కలకలం రేపుతున్నాయి. బ్రటిన్ రాణి, రాజకుటుంబీకులు ఈ శనివారం పాల్గొనే రెండో ప్రపంచయుద్ధ విజయాలకు సంబంధించిన సంస్మరణ సభలేనని లండన్‌కు చెందిన ప్రముఖ పత్రిక మిర్రర్ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది.

ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న మిలిటెంట్లు కొందరు సిరియాలో శిక్షణ పొందినవారున్నారని ఆ కథనంలో పేర్కొంది. ఐసిస్ నుంచి ఈ వివరాలను రాబట్టేందుకు స్కై న్యూస్ అనే మీడియా సంస్థ ఓ ప్రణాళికను వేసింది. రెండు కల్పిత పాత్రలతో ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ISIS new target: Plans to blow up Queen in London

పురుషుడు, మహిళ పేరుతో ట్విట్టర్, వేరే ఇతర చాటింగ్ వెబ్ సైట్ల ద్వారా చాటింగ్ చేశారు. ఈ క్రమంలోనే బ్రిటన్‌లో ఉన్న ఐఎస్ మిలిటెంట్లు బ్రిటన్ రాణి పాల్గొనే కార్యక్రమాలపై దాడి చేయడానికి వేసుకున్న వివరాలు తెలిశాయి. ఇటీవలే 19 మంది యువతులు తమకు లైంగిక బానిసలుగా ఉండేందుకు ఒప్పుకోలేదని ఐసీస్ మిలిటెంట్లు అత్యంత కిరాతకంగా వారి తలలు నరికి చంపేశారు.

ఈ మధ్య కాలంలో ఐసిస్ మిలిటెంట్లు అరాచకాలు మరింతగా పెరిగాయి. మహిళలపై వీరి అరాచకాలు చెప్పేందుకు వీలులేని విధంగా ఉన్నాయి. శనివారం నాడు ఇరాక్‌ సుప్రీం ఎలక్టోరల్‌ కమిషన్‌లో పని చేస్తున్న 300 మంది ఉద్యోగుల్ని ఐసిస్‌ ఉగ్రవాదులు కాల్చి చంపారు. నినెవెహ్‌ ప్రావిన్స్‌లోగల మోసూల్‌లో 50 మంది మహిళలను చంపారు.

English summary
According to reports in the Mirror, militants are likely to target Queen Elizabeth during the VJ commemorations, scheduled to be held in London on Saturday. Thousands of people are expected to gather for the event on this weekend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X