ఐసిస్ షాక్: కోట్ల మందిని చంపే ప్లాన్, అణు సునామీ!
ఢిల్లీ: ఇస్లాం రాజ్యస్థాపన పేరిట అరాచకం సృష్టిస్తున్న ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాదులు పాశ్చాత్య దేశాల ప్రజలందర్నీ మట్టుబెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఖలీఫా రాజ్యస్థాపన లక్ష్యంగా హిందువులు, విగ్రహారాధకులు, నాస్తికులు, యాజీదీలు, షియా ముస్లీంలను హతమార్చేందుకు వ్యూహం పన్నుతున్నారంట. అందుకోసం... ఎంతకైనా తెగించేందుకు సిద్దంగా ఉన్నారంటున్నారు.
మానవ హననం కోసం అణ్వాయుధాలను ఉపయోగించేందుకు వారు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఐసిస్ టెర్రరిస్టులతో పది రోజులు గడిపి, వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపిన, వారి వ్యూహాల గురించి తెలుసుకున్న మాజీ జర్మన్ ఎంపీ, జర్నలిస్ట్ జూర్జెన్ టోడెన్ హోపర్ ఓ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు.

ఐసిస్ ఉగ్రవాదులను పాశ్చాత్య దేశాలు తక్కువగా అంచనా వేస్తున్నాయని సదరు జర్నలిస్ట్ అభిప్రాయపడ్డారు. 50 కోట్ల మందిని చంపేందుకు ఐసిస్ వ్యూహాలు రచిస్తోందని చెప్పారు.
ఐసిస్ ఉగ్రవాదుల వ్యూహాలు భయానకంగా ఉన్నాయని, అణు సునామీ ద్వారా ప్రపంచాన్ని శవాల దిబ్బగా మార్చడమే వారి లక్ష్యంగా కనిపిస్తోందని హెచ్చరించారు. ఐసిస్ ఉగ్రవాదుల మూలాలను, మనోభావాలను తెలుసుకొని ఓ పుస్తకం రాయడం కోసం ఆయన వారితో సంబంధాలను నెలకొల్పుకున్నారు.
స్వతహాగా అమెరికా విధాలను ఎండగడుతూ మంచి క్రిటిక్‌గా పేరు తెచ్చుకోవడంతో ఆయనకు ఐసిస్ నుంచి పిలుపు వచ్చింది. ఇరాక్‌లోని మోసుల్ నగరం, పరిసర ప్రాంతాల్లో ఐఎస్ ఉగ్రవాదులతో కలసి ఆయన పది రోజుల గడిపారు.
ఆ అనుభవంతో 'ఇన్ సైడ్ ఐఎస్-టెన్ డేస్ ఇన్ ది ఇస్లామిక్ స్టేట్' అనే పుస్తకాన్ని రచించారు. ఐసిస్ ఉగ్రవాదుల మానసిక స్థితిలో మార్పు వచ్చే అవకాశాలు తనకు ఏ మాత్రం కనిపించలేదన్నారు. మానవ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విపత్తును చూడాల్సి వస్తుందేమోననే భయం తనకు కలుగుతోందన్నారు.












Click it and Unblock the Notifications