సిరియాలో వెయ్యి మంది మైనర్లను చేర్చుకున్న ఐసిస్
లండన్: ప్రపంచంలో అతి భయంకరమైన ఉగ్రవాద సంస్ధగా ఐఎస్ఐఎస్ రూపాంతరం చెందుతోంది. ఇందుకు గాను ఇప్పటి నుంచే ఉద్యోగ నియామకాలను తలపించేలా కొత్తవారిని ఐఎస్ఐఎస్‌లోకి చేర్చుకుంటోది.
ఇటీవలే సిరియాలో వెయ్యి మంది మైనర్లకు పలు రకాల పరీక్షలు పెట్టి, అనంతరం వారిని ఐఎస్ఐఎస్‌లో చేర్చుకుంటున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియోను సైతం విడుదల చేసింది. సిరియాలో పని చేస్తున్న లండన్‌కు చెందిన ఓ మానవహక్కుల సంస్ధ ఈ విషయాన్ని తెలిపింది.

ఈ ఏడాది మొదటి నుంచి తాజాగా చేర్చుకున్న మైనర్లతో సహా మొత్తం 1100 మందిని ఐఎస్ఐఎస్‌లో చేర్చుకున్నట్లు ఆ సంస్ధ తెలిపింది. ఐఎస్ఐఎస్‌లోకి తీసుకుని వారికి కఠినంగా శిక్షణ ఇస్తామని, ఆత్మాహుతి బాంబులుగా తయారు చేసి విధ్యంసాలు సృష్టిస్తామని ఆ వీడియోలో పేర్కొంది.
కాగా, ఐఎస్ఐఎస్‌కు చెందిన ఉగ్రవాద ప్రేరేపిత ఇండోనేషియా పైలెట్లు విధుల్లో ఉన్నట్లు 'ఆపరేషన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్' పేరిట ఆస్టేలియా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వీరు ఇండోనేషియాకు చెందిన వారని, ఎయిర్ ఏషియాతో పాటు ప్రీమీ ఎయిర్ విమానయాన కంపెనీలో పని చేస్తున్నారని అనుమానిస్తున్నట్టు తెలిపింది.












Click it and Unblock the Notifications