Afghanistan: ఐసిస్ దాడులు జరిగే ఛాన్స్-అమెరికాకు కీలక సమాచారం-ఇక ఆ డెడ్ లైన్ మిస్ అవొద్దని...
ఆఫ్గనిస్తాన్‌లో వివిధ సంస్థలకు చెందిన ఉగ్రవాద శక్తులన్నీ ఏకమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆఫ్గన్ తాలిబన్ల పట్టు జారిపోకుండా ఇతర ఉగ్రవాద సంస్థలు కూడా దానికి సాయం చేసేందుకు ముందుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవంట్(ISIS-K) తాలిబన్లకు మద్దతుగా వారితో చేతులు కలిపే అవకాశం ఉందంటున్నారు. కాబూల్ విమానాశ్రయాన్ని,దాని పరిసర ప్రాంతాలను ఐసిస్ టార్గెట్ చేసే అవకాశం ఉందని తాజాగా అమెరికా రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో వీలైనంత త్వరగా కాబూల్ విమానాశ్రయం నుంచి అమెరికన్లను స్వదేశానికి తరలించేందుకు అధ్యక్షుడు జో బైడెన్ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

అమెరికా,నాటో దళాల ఆధీనంలో ఎయిర్‌పోర్ట్...
ప్రస్తుతం కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అమెరికా,నాటో దళాల ఆధీనంలో ఉంది. విమానాశ్రయం వెలుపలి ప్రాంతం తాలిబన్ల నియంత్రణలో ఉంది. ఆఫ్గన్‌లో చిక్కుకుపోయిన ఇతర దేశస్తులను స్వదేశానికి తరలించేందుకు ప్రస్తుతం ఆయా దేశాలు అవసరమైన చర్యలు చేపడుతున్నాయి. సరైన డాక్యుమెంట్స్ ఉన్న ఆఫ్గన్లను సైతం అక్కడి నుంచి తరలిస్తున్నాయి. ఎవరూ దేశాన్ని వీడాల్సిన అవసరం లేదని... అందరికీ రక్షణ కల్పిస్తామని తాలిబన్లు ప్రకటించినప్పటికీ... వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి విరుద్దంగా ఉన్నాయి. దీంతో ఇతర దేశస్తులే కాదు ఆఫ్గనిస్తానీలు సైతం దేశాన్ని వీడేందుకు వేలాదిగా కాబూల్ విమానాశ్రయం వద్ద పడిగాపులు కాస్తున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోపు పూర్తయ్యేలా...
ఈ నేపథ్యంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ కాబూల్ విమానాశ్రయాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందిందని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. విమానాశ్రయంపై భారీ దాడికి ఐసిస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసిందని ప్రకటించింది. అయితే ఇప్పటికిప్పుడు ఆ దాడి జరగపోవచ్చునని పేర్కొంది. దీంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్గన్‌లో చిక్కుకుపోయిన అమెరికన్ల తరలింపు ప్రక్రియను ఈ నెల 31 వరకు పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోపు అంతా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఇందుకు తాలిబన్ల అంగీకారం కూడా ఉన్నట్లు తెలిపారు. తరలింపు ప్రక్రియకు సంబంధించి... ఇతర దేశాల అధినేతలు తమకు మరింత సమయం కావాలని అడుగుతున్నారు కదా అని కొంతమంది మీడియా ప్రతినిధులు బైడెన్‌ను ప్రశ్నించారు. అందుకు ఆయన... 'దానికోసం ఏం చేయగలమో ఆలోచిద్దాం...' అని బదులిచ్చారు.

సేఫ్‌గా తరలించేందుకు కొత్త ప్లాన్...
కాబూల్ విమానాశ్రయానికి ఐసిస్ ముప్పును ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నామని అమెరికా రక్షణ అధికారులు తెలిపారు. అమెరికన్ల తరలింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు అమెరికా రక్షణ అధికారులు కొత్త ప్లాన్‌ను రూపొందించారు.దీని ప్రకారం... ఆఫ్గనిస్తాన్‌లో చిక్కుకుపోయిన అమెరికన్లను చిన్న గ్రూపులుగా విభజిస్తారు. కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో వారిని ఉంచుతారు. అక్కడి నుంచి విమానాశ్రయానికి,ఆపై విమానాశ్రయం లోపలికి తరలిస్తారు. అమెరికన్లను సేఫ్‌గా బయటపడేసేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతున్నారు. అమెరికన్లతో పాటు ఇతర దేశస్తులు,అర్హులైన ఆఫ్గన్లను సైతం ఇందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. దీని గురించి తాలిబన్లు కూడా తెలుసునని... వారు కూడా సహకరిస్తున్నారని అమెరికా అధికారులు చెప్పడం గమనార్హం.

18 విమానాలను రంగంలోకి దించనున్న అమెరికా...
ప్రస్తుతం కాబూల్ విమానాశ్రయం బయట వేలాది మంది జనం పడిగాపులు కాస్తున్నారు. భౌగోళిక సరిహద్దులన్నింటినీ తాలిబన్లు మూసివేయడంతో... విమానయానం ఒక్కటే ప్రస్తుతం అక్కడి నుంచి బయటపడే ఏకైక మార్గం. అందుకే వేలాది మంది కాబూల్ విమానాశ్రయానికి ఇంకా చేరుకుంటూనే ఉన్నారు. ఇదే అదనుగా ఐసిస్ లేదా ఇతర తీవ్రవాద సంస్థలు ఆత్మాహుతి దాడులకు లేదా కారు బాంబు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని అమెరికా రక్షణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికన్లను వీలైనంత త్వరగా అక్కడినుంచి తరలించేందుకు ఆరు ఎయిర్‌లైన్స్‌ను రంగంలోకి దించాల్సిందిగా జో బైడెన్ ఆదేశించారు. ఇందులో అమెరికన్ ఎయిర్‌లైన్స్,అట్లాస్,డెల్టా,ఓమ్ని,హవాయిన్,యునైటెడ్ విమానయాన సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా మొత్తం 18 ప్యాసింజర్ విమానాలతో పాటు,కార్గో విమానాలు నడపనున్నారు.

ఇప్పటివరకూ 33వేల మంది తరలింపు
ఆఫ్గనిస్తాన్ నుంచి ఇప్పటివరకూ 33వేల మంది అమెరికన్లను తరలించారు. చరిత్రలోనే ఇంత సంక్లిష్టమైన తరలింపు ప్రక్రియ మునుపెన్నడూ చోటు చేసుకోలేదని జో బైడెన్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆఫ్గన్‌లో చిక్కుకుపోయిన అమెరికన్లందరినీ స్వదేశానికి తరలిస్తామని... అయితే తుది ఫలితం తమ చేతుల్లో లేదని బైడెన్ పేర్కొన్నారు. ఇంత సంక్లిష్టమైన ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు... బాధ,నష్టం,హృదయవిదారక దృశ్యాలు లేకుండా అంతా సజావుగా సాగడం కష్ట సాధ్యమన్నారు. ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణను ఆయన సమర్థించుకున్నారు.
Recommended Video

సైన్యం ఉపసంహరింపును సమర్థించుకున్న బైడెన్..
20 ఏళ్ల క్రితం స్పష్టమైన లక్ష్యాలతో మేము ఆఫ్గన్ గడ్డపై అడుగుపెట్టాం. సెప్టెంబర్ 11,2001న అమెరికాపై దాడి చేసిన అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ మరోసారి మాపై దాడి చేసేందుకు ఆఫ్గనిస్తాన్ వేదిక కావొద్దని భావించాం. అనుకున్నట్లుగానే మా లక్ష్యాలను చేరుకున్నాం. అల్ ఖైదా ప్రాబల్యాన్ని తగ్గించేశాం.ఒసామా బిన్ లాడెన్ వేటలో మేమెప్పుడూ వెనక్కి తగ్గలేదు.20 ఏళ్ల క్రితం అతన్ని మట్టుబెట్టాం.' అని జో బైడెన్ పేర్కొన్నారు.ఆఫ్గన్ నుంచి సైన్యం ఉపసంహరణను బైడెన్ సమర్థించుకున్నారు. తన నిర్ణయానికి ఇప్పటికీ పూర్తిగా కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఆఫ్గన్ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవడానికి ఇక సరైన సమయం అంటూ ఉండదని తాను గ్రహించానన్నారు. సైన్యాన్ని ఉపసంహరించుకుంటే ఎదురయ్యే రిస్క్ పట్ల తమకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. అయితే పరిస్థితులు ఇంత త్వరగా దిగజారుతాయని భావించలేదన్నారు. ఆఫ్గన్ నాయకులు చేతులెత్తేసి దేశం విడిచి పెట్టి పారిపోవడం వల్ల మిలటరీ పతనమైందన్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications