ఇస్కాన్ ఆలయంపై అల్లరిమూకల దాడి: విధ్వంసం..లూటీ

ఢాకా: బంగ్లాదేశ్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. రాజధాని ఢాకాలోని ఇస్కాన్ ఆలయంపై దుండగులు దాడి చేశారు. ధ్వంసం చేశారు. గురువారం రాత్రి కాముని పౌర్ణమి వేడుకలను జరుపుకోవడానికి స్థానిక హిందువులు సన్నాహాలు చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై హిందు సంఘాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టట్లేదని చెబుతున్నారు.

బంగ్లాదేశ్‌లో హిందువులకు మైనారిటీలుగా గుర్తింపు ఉంది. స్థానికంగా ఇస్కాన్ సహకారంతో ఢాకా శివార్లలోని వారీ ప్రాంతంలోని లాల్ మోహన్ సాహా వీధిలో రాధాకాంత ఆలయాన్ని నిర్మించుకున్నారు. ప్రతి హిందూ పండగను ఇక్కడ వైభవంగా జరుపుకుంటుంటారు. పండగ రోజుల్లో పెద్ద సంఖ్యలో గుమికూడుకుంటారు. కాముని పౌర్ణమి వేడుకలను నిర్వహించుకోవడానికి సన్నాహాలు చేసుకుంటోన్న సమయంలో దుండగులు ఆలయంపై దాడి చేశారు. విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆలయం గోడలను పగులగొట్టారు.

ISKCON temple in Bangladeshs Dhaka was vandalized by alleged extremist

ఈ ఘటనపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ స్పందించింది. హాజీ సైఫుల్లా ఈ దాడికి నాయకత్వాన్ని వహించినట్లు పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దాడిలో ముగ్గురు హిందువులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. ఆలయానికి చెందిన విలువైన వస్తువులు, విగ్రహాలకు అలంకరించిన నగలు, నగదును లూటీ చేశారని పేర్కొంది. ఇలాంటి దురాగతాలను అడ్డుకోవడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం తక్షణ చర్యలను చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

కొన్ని గంటల పాటు అల్లరిమూకలు ఇస్కాన్ ఆలయంపై యథేచ్ఛగా దాడులు చేశారని, వారీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎలాంటి ఉపయోగం లేదని హిందూ అమెరికన్ ఫౌండేషన్ పేర్కొంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలను వాయిస్ ఆఫ్ బంగ్లాదేశీ హిందూస్ అనే సంస్థ తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై అల్లరిమూకలు దాడికి పాల్పడినట్లు తెలిపింది.

ఈ ఆరునెలల కాలంలో బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులు చేయడం ఇది రెండోసారి. గత సంవత్సరం విజయదశమి సమయంలో ఢాకాలో హిందువులు ఏర్పాటు చేసుకున్న దుర్గమ్మ మండపాన్ని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. హిందువులకు రక్షణ కల్పించాలని కోరింది. భారత్ విజ్ఞప్తికి బంగ్లాదేశ్ స్పందించలేదనేది తాజాగా ఉదంతంతో స్పష్టమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+