వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ ఘాతుకం: 50 మంది వృధ్దుల ఊచకోత..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

గోజ్వా: ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల ఘాతుకాలు అంతకంతకు పెరుగుతున్నాయి. నైజీరియాలో ముసలివారిని ఎంచుకొని... ఉగ్రవాదులు పెద్దఎత్తున ఊచకోతలకు పాల్పడుతున్నారు. గ్వోజా ప్రాంతంలో ఇటీవల 50 మంది వృద్ధులను వరసగా నిలబెట్టి ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు కాల్చేశారు.

బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురికి 130 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరగడం విశేషం. గోజ్వా ఏరియాకు చెందిన ఐదు గ్రామాల్లోని వయసు పైబడిన వారిని రెండు స్కూళ్లలోకి తీసుకెళ్లి వారిని వరుసగా నిల్చోబెట్టి కాల్పులు జరిపారు.

Islamic extremists in Nigeria kill more than 50 elderly people

దీనివల్ల ప్రజల్లో ఎక్కువ భయాన్ని సృష్టించగలుగుతామని వారు భావిస్తున్నట్టు సైనిక వర్గాలు చెబుతున్నాయి. ఐతే ఈ ఘటనపై ప్రభుత్వ పెద్దలు ఎలాంటి ప్రకటన చేయకపోడవం విశేషం. గత ఏప్రిల్‌లో గుంబురి పట్టణానికి సమీపంలో 219 మంది స్కూలు అమ్మాయిలను మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు.

వారిని రక్షించే విషయంలో నైజీరియా ప్రభుత్వం, సైన్యం వైఫల్యాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. కాగా, ఇరాక్‌లో ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో ముగ్గురు సైనికులు సహా పది మంది మరణించారు. దేశ రాజధాని బాగ్దాద్‌లో బాగా రద్దీగా ఉండే వాణిజ్య కూడలిలో ఈ పేలుడు జరిపినట్టు సైనిక వర్గాలు తెలిపాయి.

ఇదిలాఉండగా, ఇదిలావుండగా, అమెరికా సైన్యాలకు సహకరిస్తూ, వైమానిక దాడులు జరిగేందుకు కారణమయ్యాడన్న కారణంగా బీరూట్‌లో ఒక సిరియన్‌ పౌరుడిని ఐఎస్‌ ఉగ్రవాదులు అందరూ చూస్తుండగానే తల నరికేశారు.

English summary
Islamic extremists in northeast Nigeria are turning their guns on elderly people, killing more than 50 this week in a new tactic that has instilled more fear in areas the militants call an Islamic caliphate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X