Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తాలిబన్లకు గట్టి షాక్-ప్రజాస్వామ్య ప్రభుత్వం కొనసాగుతుందని ప్రకటన-మళ్లీ నిలదొక్కుకోవడం సాధ్యమేనా?

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లకు గట్టి షాక్ తగిలింది.ఆఫ్గన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కొనసాగించబోతున్నట్లు గత ప్రభుత్వానికి చెందిన అధికారులు,నేతలు ప్రకటించారు.ఆష్రఫ్ ఘనీ సారథ్యంలోని ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న అమృల్లా సలేహ్ నాయకత్వంలో ప్రస్తుత ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ప్రవాసం నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతాయని వెల్లడించారు. ఈ మేరకు స్విట్జర్లాండ్‌లోని ఆఫ్గనిస్తాన్ ఎంబసీ నుంచి ప్రకటన విడుదలైంది.

త్వరలోనే ఆ 3 విభాగాలు యాక్టివ్...

త్వరలోనే ఆ 3 విభాగాలు యాక్టివ్...

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్గనిస్తాన్‌కు మాత్రమే దేశాన్ని పాలించే చట్టబద్దత ఉన్నదని అందులో పేర్కొన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ఇతర ప్రభుత్వాలేవీ భర్తీ చేయలేవన్నారు. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌ను బయటి శక్తులు ఆక్రమించారని పేర్కొన్నారు. ఆఫ్గన్ పెద్దలతో సంప్రదింపుల తర్వాత ప్రవాసం నుంచే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.త్వరలోనే ఎగ్జిక్యూటివ్,జ్యుడీషియల్,లెజిస్లేటివ్ విభాగాలు యాక్టివ్ అవుతాయని ప్రకటించారు.

మళ్లీ నిలదొక్కుకోగలరా...

మళ్లీ నిలదొక్కుకోగలరా...

పంజ్‌షీర్‌లో అహ్మద్ మసౌద్ నాయకత్వానికి మద్దతు ప్రకటించారు. ఆఫ్గనిస్తాన్‌లోని అన్ని కాన్సులేట్స్ యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించవచ్చునన్నారు.గత ప్రభుత్వానికి చెందిన అధికారులు,నేతలు కలిసి ఈ లేఖను విడుదల చేసినట్లు చెబుతున్నారు.అయితే ఈ లేఖలో మాత్రం ఎవరి పేర్లు వెల్లడించలేదు. గత ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో ఆఫ్గనిస్తాన్‌లో మున్ముందు పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనన్న చర్చ జరుగుతోంది. ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తాలిబన్లను తోసిరాజని... ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వం మళ్లీ నిలదొక్కుకోగలదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాలిబన్లను ఎదుర్కొనేవాళ్లైతే దేశాధ్యక్షుడు ఘనీ దేశం విడిచి ఎందుకు పారిపోయేవాడనే ప్రశ్న తలెత్తకమానదు. ఆష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోగా ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ మాత్రం ఆఫ్గన్‌లోనే ఉన్న సంగతి తెలిసిందే.పంజ్‌షీర్‌లో అహ్మద్ మసౌద్‌తో కలిసి తాలిబన్లను ఎదుర్కొనేందుకు ఆయన వ్యూహాలు రచిస్తున్నారు.

అంతర్యుద్దానికి దారితీసేలా పరిస్థితులు...

అంతర్యుద్దానికి దారితీసేలా పరిస్థితులు...

తాలిబన్ల అరాచక పాలనలో బెంబేలెత్తిపోతున్న ప్రజలు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నట్లు గత ప్రభుత్వం ప్రకటించడం వారికి సంతోషం కలిగించేదే. అయితే ప్రవాసం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు సాధ్యమేనా... తాలిబన్ల ఆదేశాలను కాదని ప్రజలు ప్రజాస్వామ్య ప్రభుత్వం వైపు నిలబడగలరా అన్నది చూడాలి. ఈ రెండు ప్రభుత్వాల మధ్య మళ్లీ ఘర్షణ మొదలైతే... దేశంలో అది అంతర్యుద్దానికి దారితీసే అవకాశం లేకపోలేదు. ఈ పరిణామాలు అంతర్జాతీయ సమాజాన్ని కూడా కలవరపరుస్తున్నాయి.

తాలిబన్ల అరాచక పాలన...

తాలిబన్ల అరాచక పాలన...


ఈ ఏడాది ఆగస్టు 15న కాబూల్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ఆఫ్గనిస్తాన్ మొత్తాన్ని తాలిబన్లు ఆక్రమించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 30న అమెరికా,నాటో దళాలు కాబూల్ విమానాశ్రయాన్ని వీడటంతో తాలిబన్లకు ఆఫ్గనిస్తాన్‌పై పూర్తి నియంత్రణ లభించినట్లయింది. ఆ తర్వాత 33 మంది మంత్రులతో హసన్ అఖుంద్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. ప్రభుత్వంలో అన్ని వర్గాలకు,గ్రూపులకు చోటు కల్పిస్తామని చెప్పినప్పటికీ ఆ మాటను నిలబెట్టుకోలేదు.మహిళలను అసలు పట్టించుకోనే లేదు. పైగా ఇటీవలి కాలంలో మహిళలపై అణివేతను తాలిబన్లు మరింత కఠినతరం చేస్తూ వస్తున్నారు. మహిళలు ఉద్యోగాలు మాని ఇళ్లకే పరిమితం కావాలని ఇటీవల కాబూల్ మేయర్ ఆదేశాలు జారీ చేశారు.కేవలం పురుషులతో భర్తీ చేయలేని ఉద్యోగాల్లో మాత్రమే మహిళలు కొనసాగుతారని తెలిపారు.ఇక బాలుర పాఠశాలలను రీఓపెన్ చేయాలని ఆదేశించిన తాలిబన్లు ఆడపిల్లలు చదువుకునే స్కూళ్లు మాత్రం తెరవలేదు.దీన్ని బట్టి 1996-2001 నాటి పాలనలో తాలిబన్లు మహిళల పట్ల ఎలాగైతే వ్యవహరించారో... మళ్లీ అవే కఠిన ఆంక్షలు,అణచివేతలతో మహిళలను బలి చేయబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

తీవ్ర ఆర్థిక సంక్షోభం దిశగా...

తీవ్ర ఆర్థిక సంక్షోభం దిశగా...


ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల రాజ్య స్థాపనతో తీవ్ర దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. నిన్న మొన్నటిదాకా ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగాలు చేసినవారు ఒక్కసారిగా రోడ్డునపడ్డారు. ఉద్యోగ,ఉపాధి లేక కుటుంబ పోషణ భారమై నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కడుపు నింపుకునేందుకు ఇళ్లల్లో ఉన్న వస్తువులను అమ్ముకుంటున్నారు.టోలో న్యూస్ కథనం ప్రకారం... చాలామంది కాబూల్ వాసులు తమ ఇళ్లల్లోని వస్తువులను తీసుకొచ్చి అమ్మకానికి పెడుతున్నారు. ఎంతో కొంతకు వాటిని విక్రయిస్తున్నారు.ఆ పూటకు తిండి దొరికితే చాలు అన్నట్లుగా వారి పరిస్థితి ఉంది. వ్యాపారుల పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. షాపుల్లో వస్తువులను కొనేవారు కరువవడంతో ఎంతో కొంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Recommended Video

    Afghanistan Economy In Crisis As Basic Food Prices Soar || DW Videos || Oneindia Telugu
    అంతర్జాతీయ సమాజం మద్దతు కరువు... నిధుల కొరత...

    అంతర్జాతీయ సమాజం మద్దతు కరువు... నిధుల కొరత...

    ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్),వరల్డ్ బ్యాంక్ ఇప్పటికే ఆఫ్గనిస్తాన్‌కు రుణాలు మంజూరు చేయడం నిలిపివేసింది.తాలిబన్లు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఐఎంఎఫ్ ఈ ఆంక్షలు విధించింది.అటు అమెరికా ఆఫ్గనిస్తాన్ సెంట్రల్ బ్యాంకులో 9.4బిలియన్ డాలర్ల నిధులను నిలిపివేసింది. తాలిబన్లను బ్లాక్ లిస్టులో పెట్టాల్సిందిగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) 39 మంది సభ్య దేశాలను ఆదేశించింది.దీంతో తాలిబన్ ప్రభుత్వానికి నిధుల కొరత ఏర్పడింది. అందుకే ఆఫ్గనిస్తాన్ బ్యాంకుల నుంచి కేవలం 200డాలర్లను విత్‌డ్రా లిమిట్‌గా విధించింది.ఇప్పటికే పలు బ్యాంకులు మూతపడగా... కొన్ని బ్యాంకుల ముందు జనాలు భారీ ఎత్తున బారులు తీరి కనిపిస్తున్నారు.ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో ఆఫ్గన్ సంక్షోభ నివారణకు 1బిలియన్ డాలర్లను ఆర్థిక సాయంగా అందించనున్నట్లు ఐరాస ప్రకటించింది.తాలిబన్ల ఆశలన్నీ ఇప్పుడా నిధుల పైనే ఉన్నాయి. ఆ నిధులు తమకు అందితే పేద ఆఫ్గన్ ప్రజలను ఆదుకుంటామని తాలిబన్లు చెబుతున్నారు.ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకుతో పాటు ఐడీబీ నుంచి నిధుల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ బ్యాంకులు తాలిబన్లకు నిధులు ఇవ్వడం అసాధ్యంగానే కనిపిస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+