ఐఎస్ ఉగ్రవాదుల దుశ్చర్య: జోర్డాన్ పైలట్ సజీవ దహనం
అమన్: ఇస్లామిక్ ఉగ్రవాదులు మరో దారుణానికి తెగబడ్డారు. రెండు రోజుల క్రితం జపాన్‌కు చెందిన రెండో పాత్రికేయుడి తల నరికి చంపిన ఉగ్రవాదులు.. జోర్డాన్‌కు చెందిన ఓ పైలట్‌ను సజీవంగా దహనం చేశారు. ఈ మేరకు మంగళవారం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వీడియో దృశ్యాలను విడుదల చేశారు.
ఉగ్రవాదులకు వ్యతిరేకంగా సిరియాలో చేపట్టిన సంకీర్ణ చర్యల్లో పాల్గొన్న జోర్డాన్‌కు చెందిన ఎఫ్-16 జెట్ విమానం డిసెంబర్ 24న కుప్పకూలింది. ఆ విమాన పైలట్ మాజ్ అల్ కస్సాస్బేను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు నిర్బంధించారు.

జోర్డాన్‌లో ఉన్న ఇరాకీ మహిళా ఆత్మాహుతి బాంబర్ సాజిదా అల్ రిషావిని తమకు అప్పగించకుంటే పైలట్‌ను చంపేస్తామని ఐఎస్ ఉగ్రవాదులు హెచ్చరించారు. విడుదల చేయని కారణంగా జోర్డాన్ పైలట్‌ను సజీవ దహనం చేశారు.
జోర్డాన్ పైలట్‌ను ఓ ఇనుప భోనులో ఉంచి పెట్రోలు పోసి నిప్పంటించారు. దీంతో అతడు సజీవ హనమయ్యాడు. ఈ దృశ్యాలతో కూడిన వీడియోను ఉగ్రవాదులు మంగళవారం విడుదల చేశారు. ఈ దారుణ ఘటనను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ తోపాటు ప్రపంచ దేశాలు ఖండించాయి.
కాగా, ఐఎస్ ఉగ్రవాదుల దుశ్చర్యపై జోర్డాన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అదుపులో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను ఉరితీసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications