ఐఎస్ఐఎస్ చెర నుంచి 22 మంది విడుదల

సిరియా: ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల (ఐఎస్ఐఎస్) చెరలో ఉన్న 22 మంది బందీలు క్షేమంగా విడుదల అయ్యారని సిరియా మీడియా ప్రకటించింది. విడుదలైన వారు క్షేమంగా సురక్షిత ప్రాంతాలలో ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. ఆరు నెలలు వీరు నరకం చూశారని వెలుగు చూసింది.

సిరియాలో ఫిబ్రవరి 23వ తేదీన 22 మంది క్రైస్తవులను ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లారు. మంగళవారం కిడ్నాప్ అయిన వారిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వదిలి పెట్టారు. వీరు సిరియా ఉత్తరాన ఉన్న హసాఖా పట్టణం చేరుకున్నారు.

 Islamic State (Isis) has released 22 Assyrian hostages

అందరూ సురక్షితంగా ఉన్నారని సిరియాలోని మానవహక్కుల సంఘం వెల్లడించింది. ఐఎస్ఐఎస్ ఆగడాలపై మానవహక్కుల సంఘాలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి. సుమారు ఆరు నెలల పాటు బందీలుగా ఉన్న వారిని ఉగ్రవాదులు కనికరంతో వదిలి పెట్టారు.

ఉగ్రవాదుల చెరలో ఇంకా 187 మంది మహిళలు, చిన్నారులు బందీలుగా ఉన్నారని మానవహక్కుల సంఘం అంటున్నది. తాల్ హుర్మాజ్, తాల్ షామిరామ్, తాల్ నస్రా పట్టణాలపై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాడులు చేసి అనేక మందిని కిడ్నాప్ చేసి బంధించారని వెలుగు చూసింది. క్రైస్తవులను ఐఎస్ఐఎస్ టార్గెట్ చేసుకునిందని అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+