ఐఎస్ఐఎస్ ఆస్తి 1.5 బిలియన్ డాలర్లు: యూఎస్
లండన్: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు భారీ మొత్తంలో నగదు కూడబెట్టుకుంటున్నారని అమెరికా పసిగట్టింది. ఉగ్రవాదులు నగదు ఎక్కడి నుంచి సమకూర్చుకుంటున్నారనే విషయాన్ని అమెరికా అధికారులు తెలుసుకున్నారు.
అమెరికా టెర్రరిజం అండ్ ఫైనాన్షియల్ ఇంటిలిజెన్స్ అండర్ సెక్రటరీ ఆడమ్ జుబిన్ గురువారం లండన్ లో మాట్లాడారు. ఐఎస్ఐఎస్ భారీ మొత్తంలో నగదు సమకూర్చుకుంటున్నదని ఆయన వెల్లడించారు. ఉగ్రవాదులు బ్యాంకులు లూటీ చేసి బిలియన్ డాలర్లు సంపాధించారని అన్నారు.

ఐఎస్ఐఎస్ ఆధీనంలో ఉన్న చమురు (ఆయిల్)ను బ్లాక్ మార్కెట్ కు విక్రయించి భారీ మొత్తంలో నగదు కూడబెట్టుకుంటున్నారని చెప్పారు. ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతాలలో స్థానికులను బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని అన్నారు.
ఎదురు తిరిగిన వారిని అతి క్రూరంగా చంపేయడం వల్లనే స్థానికులు భయంతో ఉగ్రవాదులకు బలవంతపు వసూళ్లకు లొంగుతున్నారని వివరించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దగ్గర ప్రస్తుతం 1.5 బిలియన్ డాలర్లు ఉన్నాయని అమెరికా ఇంటిలిజెన్స్ అధికారి ఆడమ్ జుబిన్ తెలిపారు.












Click it and Unblock the Notifications