ఐఎస్ఐఎస్ అరాచకాలు: రోడ్డున పడ్డ 2 వేల కుటుంబాలు
బాగ్దాద్: ఉగ్రవాదులు చొచ్చుకొని రావడం, సైన్యం వారి మీద తిరగబడంతో రెండు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బాగ్దాద్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియక స్థానికులు హడలిపోతున్నారు. భార్య బిడ్డలను పిలుచుకుని దూర ప్రాంతాలకు తరలిపోతున్నారు.
ఇరాక్ లోని అండార్ ప్రావిన్స్ రాజధాని రామాది ప్రాంతంలోకి ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు చొచ్చుకుని వెళుతున్నారు. వారిని అరికట్టడానికి ఇరాక్ సైనం కాల్పులు జరుపుతున్నది. అదే సమయంలో తీవ్రవాదులు బాంబు దాడులకు పాల్పడుతున్నారు.

పరస్పరం కాల్పులు, బాంబు దాడులు చేసుకోవడంతో స్థానికులు హడలిపోతున్నారు. ఎక్కడ ప్రాణాలు పోతాయో అని స్థానికంగా నివాసం ఉంటున్న 2 వేల కుటుంబాలు కట్టుబట్టలతో వెళ్లిపోయారు.
ఉగ్రవాదులు కొన్ని ప్రాంతాలలోని ఇండ్లలో చోరబడి మహిళలు, బాలికల మీద అత్యాచారం చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. కొందరిని ఎత్తుకుని వెళుతున్నారు. ఈ హింస తట్టుకోలేక 2 వేల కుటుంబాలు వేరే ప్రాంతాలకు వలస వెళ్లారని ఇరాక్ అధికారులు దృవీకరించారు.
వారి పరిస్థితి చాల దయనీయంగా ఉందని, వారికి తాత్కాలికంగా షెడ్ లు ఏర్పాటు చేసి ఆహారం అందిస్తున్నామని అధికారులు చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు చేస్తున్న అరాచకాలకు అండార్ ప్రావిన్స్ ప్రాంతంలో ఉన్న వారు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నారని ఇరాక్ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications