ఈసారి బ్రిటిష్ పౌరుడి పీక కోసిన మిలిటెంట్లు (వీడియో)
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్లు మరో దారుణానికి ఒడిగట్టారు. ఇద్దరు అమెరికా జర్నలిస్టులను చంపేసిన తర్వాత, తాజాగా, ఓ బ్రిటీష్ పౌరుడి పీక కోసి, ఆ వీడియోను ఆన్ లైన్లో పెట్టారు.
డేవిడ్ హైన్స్ (44) 'ఏసీటీఈడీ' అనే అంతర్జాతీయ ఛారిటీ సంస్థలో పనిచేస్తున్నారు. మిలిటెంట్లు 2013 మార్చిలో హైన్స్‌ను సిరియాలో ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో అతడిని గొంతు కోసి చంపిన మిలిటెంట్లు, ఘటనను వీడియో తీసి, ఎస్ఐటీఈ అనే వెబ్ సైట్లో పోస్టు చేశారు.

ఆ వీడియోకు 'అమెరికా మిత్రదేశాలకు ఓ సందేశం' అని టైటిల్ పెట్టారు. "మాకు వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేసిన సంకీర్ణంలోకి మీకై మీరు స్వచ్ఛందంగా అడుగుపెట్టారు. మీకు పూర్వ ప్రధాని టోనీ బ్లెయిర్ చేసినట్లే మీరూ చేశారు. అమెరికన్లకు 'నో' అని చెప్పలేని బ్రిటీష్ ప్రధానుల సరళిని మీరూ కొనసాగించారు" అంటూ బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ను ఉద్దేశించి ఆ వీడియోలో పేర్కొన్నారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/3nV2xE672w0?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>
అంతక ముందు ఇరాక్ దేశంలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఇసిస్) తీవ్రవాదులు తమ చెరలో ఉన్న మరో అమెరికా జర్నలిస్ట్‌ను గొంతు కోసి చంపుతున్నట్లుగా ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ జర్నలిస్ట్ పేరు స్టీవెన్ సోల్టాఫ్.‘ఎ సెకెండ్ మెసేజ్ టు అమెరికా'పేరుతో విడుదలైన ఈ వీడియోలో ఇరాక్ విషయంలో అమెరికా అనవసర జోక్యానికి సాట్లాఫ్ మూల్యం చెల్లించుకుంటున్నట్లు పేర్కొన్నారు. శిక్షను అమలు చేస్తున్నప్పుడు తీసిన వీడియోగా పేర్కొన్నారు.
హైన్స్‌ను చంపిన మిలిటెంట్లను వదలం: డేవిడ్ కామెరాన్
డేవిడ్ హైన్స్‌ను ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు చంపేయడంపై బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తీవ్రంగా స్పందించారు. హైన్స్‌ను బలిగొన్న మిలిటెంట్లను వదలమని, పట్టి తెచ్చి చట్టం ముందు హాజరుపరుస్తామని స్పష్టం చేశారు. మిలిటెంట్ల దురాగతాన్ని 'అచ్చమైన రాక్షస చర్య' అని పేర్కొన్నారు. హైన్స్ హంతకులను పట్టుకునేందుకు తమ సర్వశక్తులూ ఒడ్డుతామని ట్విట్టర్లో తెలిపారు. కాగా, ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు పోస్టు చేసిన వీడియోను పరిశీలిస్తున్నామని బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యాలయం తెలిపింది.












Click it and Unblock the Notifications