ఇజ్రాయెల్ బిగ్ బ్రేక్ త్రూ: హెజ్బొల్లా చీఫ్ మృతి

Hezbollah chief Hassan Nasrallah: లెబనాన్‌‌పై ఇజ్రాయెల్ సాగిస్తోన్న భీకర దాడులు మరో మలుపు తిరిగాయి. కొద్దిరోజులుగా ఏకధాటిగా కురిపిస్తోన్న మిస్సైళ్లు, శక్తిమంతమైన బాంబుల వర్షానికి హెజ్బొల్లా కకావికలమౌతోంది. నిన్నటి వరకూ ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ప్రతిఘటిస్తూ, తిప్పి కొడుతూ వచ్చిన ఈ మిలిటెంట్ గ్రూప్ ఇప్పుడు దాదాపుగా నిర్వీర్యమైనట్టే కనిపిస్తోంది.

తాజాగా లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ సాగించిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లా అధినేత హసన్ నస్రుల్లా హతం అయ్యారు. ఆయనతో పాటు సదరన్ ఫ్రంట్ కమాండర్ అలీ కర్కీ, ఇతర కమాండర్లు కూడా హతం అయ్యారు. బీరుట్ దక్షిణ ప్రాంతంలోని దహియాలో గల హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై జరిపిన దాడుల్లో వారిద్దరూ మరణించారు.

Israel confirmed the Hezbollah chief Hassan Nasrallah assassination

ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. తన ఉగ్రవాద కార్యకలాపాలతో హసన్ నస్రుల్లా ఇక ఈ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చెయ్యలేడని తెలిపింది. దీనిపై హెజ్బొల్లా నుంచి ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ దాడుల్లో ఆయన కుమార్తె జైనబ్ నస్రుల్లా సైతం మరణించినట్లు సమాచారం

కొద్దిరోజులుగా ఇజ్రాయెల్.. లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై దాడులను ముమ్మరం చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. కొన్ని ఏకధాటిగా మిస్సైళ్ల వర్షం కురుపించిందక్కడ. జనావాసాలను సైతం లెక్కచేయట్లేదు ఇజ్రాయెల్. క్షిపణులు, అత్యాధునిక డ్రోన్ల సహకారంతో శక్తిమంతమైన బాంబు దాడులను కొనసాగించింది.

దీనికోసం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అత్యంత శక్తిమంతమైన, ఆధునిక ఆయుధాలను ఉపయోగించింది. తేలికపాటి మిస్సైళ్లను సైతం మోసుకెళ్లే సామర్థ్యం గల డ్రోన్లను ప్రయోగిస్తోంచింది. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 720 మంది దుర్మరణం పాలయ్యారు. అదే స్థాయిలో తీవ్రంగా గాయపడ్డారు.

లెబనాన్‌లో మొత్తంగా 1,300లకు పైగా హెజ్బొల్లా స్థావరాలపై ఈ దాడులు సాగినట్లు అక్కడి మీడియా పేర్కొంది. బీకా వ్యాలీ,సిడాన్, మర్జయాన్, నబాటి, టయర్, జెజ్ఝీన్, జెహ్రానీ జిల్లాలతో పాటు తూర్పు ప్రాంతంలోని జహ్లేయ్, బాల్బెక్, హెర్మెల్‌ వంటి ప్రాంతాలపై నిరంతరాయంగా దాడులు సాగాయి.

ఈ ఘటనతో మధ్య- తూర్పు దేశాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. హెజ్బొల్లా ప్రస్తుతం నివురు గప్పిన నిప్పులా ఉంటోంది. ఇప్పటివరకు కూడా హసన్ నస్రత్ మృతి గురించి ఎక్కడా స్పందించలేదు. ఇజ్రాయెల్ చేసిన ప్రకటనను ధృవీకరించనూ లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+