Israel-Palestine : ఇజ్రాయెల్ లో ఎమర్జెన్సీ ప్రకటన- ప్రధాని మోడీ సంఘీభావం..

ఇజ్రాయెల్ పై ఇవాళ పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు, ప్రభుత్వ దాడులు కలిసి చేసిన దాడులు, ప్రతిదాడులతో ఇరు దేశాల్లోనూ ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా హమాస్ ఉగ్రవాదులు పకడ్బందీ వ్యూహంతో కేవలం
అరగంట వ్యవధిలోనే దాదాపు 7 వేల రాకెట్లను ఇజ్రాయెల్ పై ప్రయోగించడంతో ఆ దేశం ఉలిక్కిపడింది. నిఘా వైఫల్యం కారణంగానే ఇజ్రాయెల్ పై ఈ స్ధాయిలో దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

పాలస్తీనా దాడులతో కొద్ది గంటల్లోనే కోలుకున్న ఇజ్రాయెల్.. హమాస్ తీవ్రవాదులు రాకెట్లు ప్రయోగిస్తున్న గాజా స్ట్రిప్ పై వైమానిక దాడులు ప్రారంభించింది. హమాస్ దాడుల్లో 22 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. అలాగే దాదాపు 30 మందికి పైగా ఇజ్రాయెల్ సైనికుల్ని పాలస్తీనా బందీలుగా పట్టుకుపోయింది. దీంతో ఇజ్రాయెల్ రగిలిపోతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ లో యుద్ధ పరిస్ధితిని ప్రకటించిన ప్రభుత్వం పౌరుల్ని ఇళ్లలోనే ఉండాలని సూచించింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటన చేసింది.

Israel declared emergency amid palestine attacks, indian pm narendra modi expresses solidarity

మరోవైపు పాలస్తీనా దాడులతో ఉక్కిరిబిక్కిరైన ఇజ్రాయెల్ కు భారత్ సంఘీభావం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ప్రధాని మోడీ తెలిపారు. ఇజ్రాయెల్‌కు భారత్ సంఘీభావంగా నిలుస్తుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో తీవ్రవాద దాడుల వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాననని, తమ ఆలోచనలు, ప్రార్థనలు అమాయక బాధితులు, వారి కుటుంబాలతో ఉన్నాయన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా నిలుస్తామన్నారు.

అటు అమెరికా కూడా ఇజ్రాయెల్ పై పాలస్తీనా దాడుల్ని ఖండించింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం, ప్రజలకు తాము అండగా నిలుస్తామని ప్రకటించింది. జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ ఇజ్రాయెల్ జాతీయ సలహాదారు త్జాచి హనెగ్బితో మాట్లాడారు. ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ ఉగ్రవాదుల అకారణ దాడులను అమెరికా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదానికి ఎప్పుడూ సమర్థన లేదని, ఇజ్రాయెల్ ప్రభుత్వం, ప్రజలతో దృఢంగా నిలబడతామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+